Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 140327
            [news_title_telugu_html] => 

ఖాన్‌లకు ప్రభాస్‌ గట్టి పోటీనిస్తారా? 

[news_title_telugu] => ఖాన్‌లకు ప్రభాస్‌ గట్టి పోటీనిస్తారా?  [news_title_english] => Prabhas was asked to speak in Hindi at Saaho trailer launch His response will leave you in splits [news_short_description] => యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ముంబయి వెళ్లారు. ఈ సందర్భంగా [news_tags_keywords] => prabhas,shraddha kapoor,saaho [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-11 12:46:25 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఖాన్‌లకు ప్రభాస్‌ గట్టి పోటీనిస్తారా?  - Prabhas was asked to speak in Hindi at Saaho trailer launch His response will leave you in splits - EENADU
close

తాజా వార్తలు

ఖాన్‌లకు ప్రభాస్‌ గట్టి పోటీనిస్తారా? 

ఆయన సమాధానమేంటో తెలుసా?

ముంబయి: యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ముంబయి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ మహిళా విలేకరి ప్రభాస్‌ను ప్రశ్నిస్తూ.. ‘సర్‌.. మీకున్న క్రేజ్‌తో బాలీవుడ్‌ ఖాన్‌త్రయానికి (ఆమిర్‌, సల్మాన్‌, షారుక్‌)గట్టి పోటీనిస్తారా?’ అని ప్రశ్నించారు. ఇందుకు ప్రభాస్‌ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు మేడమ్‌. ఇక నేను బయలుదేరనా?’ అని చమత్కరించారు.

అనంతరం.. ‘మీ ముంబయి ఫ్యాన్స్‌ కోసం హిందీలో మాట్లాడండి’ అని సదరు విలేకరి ప్రభాస్‌ను కోరారు. ఇందుకు ప్రభాస్‌.. ‘జై హింద్‌’ అని చెప్పారు. తనకు హిందీ చదవడం, రాయడం వచ్చు కానీ మాట్లాడటం రాదని ప్రభాస్‌ ఈ సందర్భంగా చెప్పారు. అందుకే ‘సాహో’ సినిమాలో హిందీ వెర్షన్‌కు సంబంధించిన డైలాగులు పలకడంలో తడబడ్డానని తెలిపారు. తన పాత్ర వరకు డబ్బింగ్‌ చెప్పించారని పేర్కొన్నారు. ‘సాహో’ సినిమా ఉత్తర భారత్‌లో దాదాపు 4,500 తెరలపై విడుదల కానుంది. ఆగస్ట్‌ 30న ‘సాహో’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.