close

తాజా వార్తలు

ఫ్యాన్స్‌కు పూరీ, విజయ్‌ దేవరకొండ సర్‌ప్రైజ్‌!

క్రేజీ కాంబినేషన్‌.. ప్రకటించిన టీం

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పూరీ కనెక్స్ట్‌ సోమవారం ప్రకటించింది. క్రేజీ కాంబినేషన్‌లో మీ ముందుకు సినిమా రాబోతోందంటూ.. పూరీ, విజయ్‌, ఛార్మి కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. పూరీ, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ట్వీట్‌ చేసింది. డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ, లేటెస్ట్‌ సెన్సేషన్‌ విజయ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుండటం నిజంగా సర్‌ప్రైజింగ్‌గా ఉందని, దీన్ని ఊహించలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

పూరీ చాలా ఏళ్ల తర్వాత ఇటీవల ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మంచి హిట్‌ అందుకున్నారు. విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’తో జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. భరత్‌ కమ్మా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక పాత్ర పోషించారు. దీని తర్వాత తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై తెరకెక్కిస్తున్న ‘హీరో’లో విజయ్‌ నటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజుల షూటింగ్‌ జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా చిత్ర బృందం స్పందించలేదు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.