close

తాజా వార్తలు

ఆ రికార్డు సృష్టించిన రెండో హాలీవుడ్‌ చిత్రం ఇదే

ఇంటర్నెట్‌డెస్క్‌: డిస్నీ రీమేక్‌ ‘ది లయన్‌ కింగ్‌’ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద గర్జిస్తోంది. ఇప్పటికే రూ.100కోట్ల కలెక్షన్లను దాటిన ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా అన్ని భారతీయ భాషల్లో కలిపి రూ.150కోట్ల వసూలు చేసినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఇక గ్రాస్‌ కలెక్షన్స్‌ చూస్తే రూ.178కోట్లకు చేరింది. 

ఈ ఏడాది ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ తర్వాత భారత్‌లో భారీ వసూళ్లను సాధించిన రెండో హాలీవుడ్‌ చిత్రంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1.3బిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. యానిమేషన్‌ చిత్రాల్లో ఆల్‌టైమ్‌ రికార్డు ఇది. ఇంతకు ముందు ఈ రికార్డు 1.2 బిలియన్‌ డాలర్లతో ‘ఫ్రోజెన్‌’ పేరిట ఉండేది. జాన్‌ ఫెవరూ దర్శకత్వం వహించిన లయన్‌ కింగ్‌ చిత్రంలోని పాత్రలకు తెలుగులో నాని, జగపతిబాబు, పి.రవిశంకర్‌, బ్రహ్మానందం, అలీ, లిప్సిక, షేకింగ్‌ శేషు తదితరులు డబ్బింగ్‌ చెప్పారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.