close

తాజా వార్తలు

విష్ణుకు మరోసారి జోడీగాఅమలాపాల్‌

అమలాపాల్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: గత ఏడాది విడుదలైన చిత్రాల్లో విష్ణు నటించిన ‘రాక్షసన్‌’ హిట్‌గా నిలిచింది. అమలాపాల్‌ కథానాయికగా నటించింది. కలెక్షన్ల పరంగా కూడా విజయం సాధించిన ఈ సినిమా ఇటీవల తెలుగులో ‘రాక్షసుడు’గా రీమేక్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ విష్ణు, అమలాపాల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ తమిళ రీమేక్‌లో వీరు నటించనున్నారు. క్రికెట్‌పై మంచి పట్టున్న విష్ణు... ‘జీవా’ చిత్రం తర్వాత ఇందులో మళ్లీ క్రికెటర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాతో మరో విజయాన్ని తప్పకుండా సొంతం చేసుకుంటానని నమ్మతున్నారు విష్ణు. శ్రద్ధ శ్రీనాథ్‌ పాత్రలో అమలాపాల్‌ నటించనుందని తాజా సమాచారం. ఇతర నటీనటులు, సాంకేతిక కళాకారుల ఎంపిక పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను రానా నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

విష్ణు


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.