Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141881
            [news_title_telugu_html] => అప్పుడు నా జేబులో రూ.200 కూడా లేవు!
            [news_title_telugu] => అప్పుడు నా జేబులో రూ.200 కూడా లేవు!
            [news_title_english] => Did not have even Rs 200 when I started my career says Akshay kumar
            [news_short_description] => బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఫ్లాప్‌ వచ్చినప్పుడు కుంగిపోకుండా.. హిట్‌ వచ్చినప్పుడు పొంగిపోకుండా...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => | |
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-15 00:21:15
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
అప్పుడు నా జేబులో రూ.200 కూడా లేవు! - Did not have even Rs 200 when I started my career says Akshay kumar - EENADU
close

తాజా వార్తలు

అప్పుడు నా జేబులో రూ.200 కూడా లేవు!

కానీ ఇప్పుడు..: అక్షయ్‌ కుమార్‌

ముంబయి: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఫ్లాప్‌ వచ్చినప్పుడు కుంగిపోకుండా.. హిట్‌ వచ్చినప్పుడు పొంగిపోకుండా నేడు స్టార్‌ హీరోగా నిలదొక్కుకున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న సెలబ్రిటీల్లో ఒకరుగా నిలిచారు. కాగా నటుడిగా తొలినాళ్లలో ఎదుర్కొన్న సవాళ్లను ఆయన తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు తన జేబులో కనీసం రూ.200 కూడా ఉండేవి కాదని చెప్పారు.

‘నా జీవితంలో అనేక దారుణమైన సంఘటనల ఎదుర్కొన్నాను. పేదరికాన్ని అనుభవించాను. నా కెరీర్‌లో కనీసం మూడు, నాలుగు సార్లు ఒడిదుడుకులు చవిచూశా. ఇలాంటివి ప్రతి నటుడికి సహజం. ఎదురుదెబ్బ తగిలినప్పుడు, అవి గుర్తొచ్చినప్పుడు నా ఇంటి గ్రౌండ్‌ ఫ్లోర్‌కి వెళ్తుంటా. అక్కడ ఉన్న నా కార్లును, ఇంటి ఆవరణను పూర్తిగా చూస్తుంటా. ఆ తర్వాత నా ఆఫీసుకు వెళ్లి.. మొత్తం చూసొస్తా. ‘దేవుడు నాపై ఎంతో దయ చూపించాడు. ఇంత ఎదిగిన తర్వాత (ఆర్థికంగా, నటుడిగా) కూడా చిన్న ఇబ్బందులకు బాధపడే హక్కు నాకు లేదు. బయట ఏమీ లేకుండా బాధపడుతున్న చాలా మంది ప్రజలు ఉన్నారు’ అని నాకు నేనే సమాధానం చెప్పుకుంటా. నేను ముంబయికి వచ్చిన కొత్తలో నా జేబులో కనీసం రూ.200 కూడా ఉండేవి కాదు. కానీ ఇవాళ నా దగ్గర ఎంతో ఉంది’ అని అక్షయ్‌ గుర్తు చేసుకున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.