close

తాజా వార్తలు

‘ప్రియాంకచోప్రా.. ఆ బాధ్యతలకు అనర్హురాలు’

ముంబయి: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను యూఎన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌ నుంచి తొలగించాలని పాకిస్థాన్‌ మంత్రి షిరీన్‌ మజారీ యునిసెఫ్‌కు ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఆమె భారత ఆర్మీకి, మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తక్షణం ఆమెను ఆ బాధ్యతల నుంచి తొలగించకపోతే ఆ పదవిని అపహాస్యం చేసినట్టు అవుతుందని పేర్కొన్నారు. ఇలాంటి అత్యున్నత, గౌరవప్రదమైన పదవులకు ఎవర్నైనా నియమించేటప్పుడు యునిసెఫ్‌ తగు జాగ్రత్తలు తీసుకోవాలని షిరీన్‌ కోరారు.
పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లో భారత ఆర్మీ వైమానిక దాడులు చేసింది. ఆ దాడిని ఉద్దేశిస్తూ ప్రియాంక ట్విటర్‌లో ‘జైహింద్‌’ అని ట్వీట్‌ చేశారు. గతంలో ఈ విషయానికి సంబంధించి పాకిస్థానీ మద్దతుదారులు ఆమెపై మండిపడ్డారు. ఓ పాకిస్థానీ యువతి సైతం ఇటీవల లాస్‌ఏంజెల్స్‌లో ప్రియాంక పాల్గొన్న బ్యూటీకాన్‌ కార్యక్రమంలో ఈ ప్రస్తావనను తీసుకువచ్చింది. ప్రియాంక దీనికి ప్రతిస్పందనగా ...‘‘ముందుగా నేను భారతీయురాలిని. నేను ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. నీ దేశం కోసం నువ్వు ఏ విధంగా అయితే నన్ను ప్రశ్నిస్తున్నావో? అదే విధంగా నేను నా దేశంపై ఉన్న భక్తి, గౌరవం కారణంగా ఆ ట్వీట్‌ చేశాను. అరిచి నీ పరువు తీసుకోకు’’ అని చురకలు అంటించారు. ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ అయిన విషయం విదితమే.




Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.