
తాజా వార్తలు
హైదరాబాద్: ఎందరో వీరుల ప్రాణ త్యాగానికి ప్రతిఫలం ఇవాళ జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భంగా అమర వీరులకు సినీ ప్రముఖులు సెల్యూట్ చేశారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్‌బాబు, అల్లు అర్జున్, కరణ్ జోహార్, హన్సిక, పూరీ జగన్నాథ్, అఖిల్, సోనాక్షి సిన్హా తదితరులు ట్వీట్ చేశారు. కొందరు సెలబ్రిటీలు త్రివర్ణ జెండా పట్టుకుని ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ఎన్టీఆర్ తన కుమారుడు అభయ్‌రామ్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘జైహింద్’ అని పోస్ట్ చేశారు.
> కరణ్ జోహార్: మన దేశం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నాను, జై హింద్. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
> మహేశ్‌బాబు: మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు, శత్రువులతో ధైర్యంగా పోరాడుతున్న జవాన్లకు నా సెల్యూట్. కేవలం ఇవాళే కాదు ప్రతి రోజూ వారి సేవలు మనం గుర్తించాలి. జై హింద్. భారతీయుడిగా గర్వపడుతున్నా.
> అల్లు అర్జున్: అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వేచ్ఛ ఎందరో హీరోల త్యాగానికి నిదర్శనం. వందేమాతరం.
> రకుల్ ప్రీత్ సింగ్: అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వేచ్ఛ అనే పదానికి సరైన అర్థం తెలుసుకుందాం. ఎదుటి వారి స్వేచ్ఛను గౌరవిద్దాం. మన దేశ అభివృద్ధికి కృషి చేద్దాం.
> హన్సిక: భారత పౌరులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.
> అనుష్క శర్మ: నాతోటి భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
> సోనాక్షి సిన్హా: నాతోటి భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాను. కాబట్టి ఈ రోజు నాకెంతో ప్రత్యేకం. జైహింద్.
> ఆయుష్మాన్ ఖురానా: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
> రవీనా టాండన్: దేశ ప్రజలు ఎప్పుడూ శాంతితో సంతోషంగా ఉండాలి. దేశ అభివృద్ధి కోసం మనమంతా కలిసి కృషి చేద్దాం. నేను భారతీయురాలిని కావడం గర్వంగా ఉంది. జై హింద్.
> రాయ్ లక్ష్మి: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.
> పూరీ జగన్నాథ్: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జనగణమన..
> నీల్ నితిన్ ముఖేష్: నా కుమార్తె పుట్టిన తర్వాత వచ్చిన తొలి స్వాతంత్ర్య దినోత్సవం ఇది. మీ అందరికీ శుభాకాంక్షలు. జై హింద్.
> సుశాంత్: స్వాతంత్ర్య దినోత్సవం రోజునే రాఖీ పండగను జరుపుకోవడం నాకు నచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
> హరీష్ శంకర్: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకీ జై.
> శ్రీకాంత్: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
> అఖిల్: నా దేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. పౌరులుగా మేమంతా నీకు సెల్యూట్ చేస్తున్నాం. నాది భారతదేశం అని చెప్పుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జై హింద్.
> హ్యుమా ఖురేషీ: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరు భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
- ఆ పాత్రకు అరవిందస్వామి అనుకున్నారట!
- ఎంజీ విద్యుత్తు కారు విశేషాలు ఇవే..
- కేటీఆర్‌తో చర్చకు సిద్ధం: లక్ష్మణ్
- బురద చల్లేందుకే ‘రౌండ్‌టేబుల్’:అంబటి
- ఇంటి వరకూ తోడుగా వస్తారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
