Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143376
            [news_title_telugu_html] => 

జెండా పండక్కి వచ్చారు.. సందడి చేశారు!

[news_title_telugu] => జెండా పండక్కి వచ్చారు.. సందడి చేశారు! [news_title_english] => Independence day special film promotions [news_short_description] => ఈ ఏడాది రాఖీ పండుగ స్వాతంత్ర్య దినోత్సవం నాడు వచ్చి ప్రజల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇదే ప్రత్యేక సందర్భంగా భావించిన చిత్ర పరిశ్రమ పోస్టర్లు, టీజర్లు, ప్రత్యేక వీడియోలతో ప్రచారాన్ని హోరెత్తించింది. సినీ అభిమానులకు ట్రీట్‌ ఇచ్చింది.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 09:47:52 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జెండా పండక్కి వచ్చారు.. సందడి చేశారు! - Independence day special film promotions - EENADU
close

తాజా వార్తలు

జెండా పండక్కి వచ్చారు.. సందడి చేశారు!

జోరుగా సినీ ప్రమోషన్‌.. ఓ లుక్కేయండి

ఈ ఏడాది రాఖీ పండుగ.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు వచ్చి ప్రజల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇదే ప్రత్యేక సందర్భంగా భావించిన చిత్ర పరిశ్రమ సైతం పోస్టర్లు, టీజర్లు, ప్రత్యేక వీడియోలతో ప్రచారాన్ని హోరెత్తించింది. సినీ అభిమానులకు ట్రీట్‌ ఇచ్చింది. ‘సైరా’తో మొదలైన ఈ జోరు.. ‘అల వైకుంఠపురములో’ టైటిల్‌, ‘వాల్మీకి’ టీజర్‌తోపాటు మరికొన్ని సినిమాల పోస్టర్ల వరకు కొనసాగింది. వాటి వైపు ఇప్పుడు ఓ లుక్కేద్దాం..

నరసింహారెడ్డి పోరాటం

మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఆయనతోపాటు మిగిలిన యూనిట్‌ సభ్యులు కూడా సినిమాకు న్యాయం చేయడానికి కష్టపడుతున్నారు. ఇదంతా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం విడుదలైన ‘సైరా’ మేకింగ్‌ వీడియోలో స్పష్టంగా కనిపించింది. చిరుతోపాటు నయనతార, తమన్నా కూడా బలమైన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. అక్టోబరు 2న ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


సైనికుల త్యాగానికి నివాళిగా..

నిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. ఇటీవల మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో మహేశ్‌ పాత్రను పరిచయం చేసిన చిత్ర బృందం.. తాజాగా స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి సేవ చేస్తూ త్యాగానికి మారుపేరైన భారత సైనికులకు ఘన నివాళిగా ఓ పాటతో కూడిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ సాగిన ఈ వీడియోలో 1971 ఇండో-పాక్‌ వార్‌, సియాచిన్‌ వివాదం, కార్గిల్‌ యుద్ధం, 2016 సర్జికల్‌ స్ట్రైక్స్‌ చిత్రాలను చూపించారు. ఆయా దృశ్యాలన్నీ రోమాంచితంగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో మహేశ్‌ ఆర్మీ అధికారి మేజర్‌ అజయ్‌కృష్ణగా కనిపించనున్నారు. ‘సరిలేరు.. నీకెవ్వరూ..’ అంటూ వినిపించిన బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ అభిమానులను అలరిస్తోంది.


గ్యాప్‌ తీసుకోలా.. వచ్చింది

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ సినిమా 2020లో విడుదల కాబోతోంది. ‘నా పేరు సూర్య..’ తర్వాత కాస్త విరామం తీసుకుని ఈ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ఓ ప్రత్యేక టీజర్‌తో గురువారం విడుదల చేసింది. ఇందులో స్టైలిష్‌ స్టార్‌ మధ్య తరగతి యువకుడిలా కనిపించారు. ‘ఏంట్రోయ్.. గ్యాప్‌ ఇచ్చావు?’ అని మురళీ శర్మ ప్రశ్నిస్తే.. ‘ఇవ్వలా.. వచ్చింది’ అని బన్నీ వెటకారంగా సమాధానం చెప్పే తీరు ఆకట్టుకుంది. ఈ డైలాగ్‌ మురళీ శర్మకే కాదు.. బన్నీ ఈ సినిమాకు బాగా టైం తీసుకున్నారన్న ఫ్యాన్స్‌కూ వర్తిస్తుంది.


రెండు బుల్లెట్లు దాచుకోవాలి

మెగా హీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. అద్వర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో వరుణ్‌ లుక్స్‌, డైలాగ్‌ డెలివరీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్‌ చివర్లో ‘అందుకే పెద్దోళ్లు చెప్పిర్రు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే, రెండు కాల్చుకోవాలి. రెండు దాచుకోవాలి’ అని ఆయన చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.


మరో భారతీయుడు

శంకర్‌ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న ‘భారతీయుడు 2’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ ‘భారతీయుడు’ గెటప్‌లోనే కమల్‌ మరోసారి కనువిందు చేశారు. కాజల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 


‘రాజా’ రవితేజ

మాస్‌ మహారాజా రవితేజ ‘డిస్కోరాజా’ పోస్టర్‌ కూడా ఇదే సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేం వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాల్లూరి నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.


గూఢచారి ‘చాణక్య’

యాక్షన్‌ హీరో గోపీచంద్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘చాణక్య’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో గోపీచంద్‌ చాలా స్టైలిష్‌గా కనిపించారు. తిరు దర్శకత్వం వహిస్తున్నారు. మెహరీన్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటి జరీన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విశాల్‌ శేఖర్‌ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 


హోయ్‌నా.. హోయ్‌నా అంటున్న నాని

విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్’. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేశారు. ‘ఏదో వింత రాగమే విన్నానా.. హోయ్‌నా.. హోయ్‌నా..హోయ్‌నా..’ అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకుంటోంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబరు 13న ‘గ్యాంగ్‌లీడర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.