Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144583
            [news_title_telugu_html] => 

ఆకట్టుకుంటోన్న ‘సాహో’ ప్రత్యేక గీతం

[news_title_telugu] => ఆకట్టుకుంటోన్న ‘సాహో’ ప్రత్యేక గీతం [news_title_english] => Saaho film Bad Boy Song released [news_short_description] => ‘సాహో’ సినిమాలోని ప్రత్యేక గీతం విడుదలైంది. ఇందులో ప్రభాస్‌తో కలిసి శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ చిందులేశారు. ‘డార్లింగ్‌’ చుట్టూ పదుల సంఖ్యలో అమ్మాయిలున్నారు. ‘మేబీ ఐ యామ్‌ ఎ బ్యాడ్‌ బాయ్‌ కన్‌ యు బి మై బ్యాక్‌బోన్‌... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => FLPWoyJQ_hA [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 17:21:16 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆకట్టుకుంటోన్న ‘సాహో’ ప్రత్యేక గీతం - Saaho film Bad Boy Song released - EENADU
close

తాజా వార్తలు

ఆకట్టుకుంటోన్న ‘సాహో’ ప్రత్యేక గీతం

‘ఐయామ్‌ ఎ బ్యాడ్‌బాయ్‌’

హైదరాబాద్‌: ‘సాహో’ సినిమాలోని ప్రత్యేక గీతం విడుదలైంది. ఇందులో ప్రభాస్‌తో కలిసి శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ చిందులేశారు. ‘డార్లింగ్‌’ చుట్టూ పదుల సంఖ్యలో అమ్మాయిలున్నారు. ‘మేబీ ఐయామ్‌ ఎ బ్యాడ్‌ బాయ్‌ కెన్‌ యు బి మై బ్యాక్‌బోన్‌ హాయ్‌ బేబీ సో..’ అంటూ తెలుగు, ఇంగ్లిషు కలగలిపి ఈ పాట లిరిక్స్‌ రూపొందించారు. జాక్వెలిన్‌ డ్యాన్స్‌, అందం పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆమె, ప్రభాస్‌కు మధ్య కెమిస్ట్రీ కుదిరిందని, ప్రత్యేకంగా ఉందని యూట్యూబ్‌లో నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ‘డార్లింగ్‌’ పరిచయ గీతంగా సినిమాలో దీన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఈ సినిమాలోని ‘సైకో..‌’, ‘ఏ చోట నువ్వున్నా..’ అనే రెండు గీతాల్ని విడుదల చేశారు. ఇప్పుడు మూడో గీతంగా ‘బ్యాడ్‌ బాయ్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.