Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145566
            [news_title_telugu_html] => 

చిరు ఫ్యాన్స్‌కు ఇదే బెస్ట్‌ గిఫ్ట్‌

[news_title_telugu] => చిరు ఫ్యాన్స్‌కు ఇదే బెస్ట్‌ గిఫ్ట్‌ [news_title_english] => This is the best gift to all Chiranjeevi fans sudeep praises surender reddy [news_short_description] => ‘సైరా నరసింహారెడ్డి’ దర్శకుడు సురేందర్‌రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రముఖ నటుడు సుదీప్‌. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సినిమా... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => qZoWxaz2YPc [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 00:32:53 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చిరు ఫ్యాన్స్‌కు ఇదే బెస్ట్‌ గిఫ్ట్‌ - This is the best gift to all Chiranjeevi fans sudeep praises surender reddy - EENADU
close

తాజా వార్తలు

చిరు ఫ్యాన్స్‌కు ఇదే బెస్ట్‌ గిఫ్ట్‌

సురేందర్‌రెడ్డిపై సుదీప్‌ ప్రశంసలు

హైదరాబాద్‌: ‘సైరా నరసింహారెడ్డి’ దర్శకుడు సురేందర్‌రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రముఖ నటుడు సుదీప్‌. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. దీని గురించి సురేందర్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఈ సినిమా నా కెరీర్‌లోనే భారీ చిత్రం. దీని కోసం రాత్రింబవళ్లు ఎంతో కష్టపడ్డాం’ అని పేర్కొన్నారు. దీనిపై సుదీప్‌ స్పందిస్తూ.. ‘టీజర్‌పై వస్తున్న ప్రతీ ప్రశంసలకు మీరు అర్హులే సురేందర్‌. సినిమా కోసం ఎంత కష్టపడ్డారో దగ్గరుండి చూశాను. ఇది చిరంజీవి ఫ్యాన్స్‌కి బెస్ట్‌ కానుక’ అని పేర్కొన్నారు. ‘సైరా’ చిత్రంలో సుదీప్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, జగపతిబాబు, తమన్నా, అనుష్క, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘సైరా’ కన్నడ టీజర్‌ రికార్డు

తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైన ‘సైరా’ టీజర్‌.. కన్నడలో రికార్డు సృష్టించింది. 24 గంటల్లోనే ఈ టీజర్‌ను 30 లక్షల మంది వీక్షించారు. ఇప్పటివరకు కన్నడలో విడుదలైన టీజర్లలో సుదీప్‌ నటించిన ‘పెహల్వాన్‌’ టీజర్‌ 24 గంటల్లో 2.4 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును ‘సైరా’ టీజర్‌ బీట్‌ చేసింది.

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.