close

తాజా వార్తలు

‘సాహో’ను ఆ సినిమాలతో పోల్చొద్దు

ఫ్యాన్స్‌తో ప్రభాస్‌, శ్రద్ధ చిట్‌చాట్‌

ముంబయి: ‘డై హార్డ్‌ ఫ్యాన్స్‌’ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘సాహో’ చిత్రం 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలతో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, శ్రద్ధ.. అభిమానులతో ట్విటర్‌ లైవ్‌చాట్‌లో పాల్గొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు ఈ జంట ఇచ్చిన సమాధానాలేంటో చూడండి. 
‘సాహో’ కోసం జపాన్‌కు వస్తారా?
ప్రభాస్: ‘బాహుబలి’ సినిమా కోసం వచ్చాం. అక్కడి అభిమానులు సొంతవారిని చూసుకున్నట్లుగా మమ్మల్ని ఎంతో ప్రేమగా, అప్యాయంగా పలకరించారు. కాబట్టి ఈసారి కూడా ‘సాహో’ చిత్రంబృందంతో కలిసి తప్పకుండా జపాన్‌ వస్తాను.

శ్రద్ధా.. మాకోసం ‘సాహో’ సినిమాలోని ఒక డైలాగ్‌ చెప్తారా?
శ్రద్ధ: ఒక డైలాగ్‌ ఎంపికచేసుకుని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చాలా అమేజింగ్‌ డైలాగులను సినిమాకు అందించారు. కాబట్టి ఏది ఎంపిక చేసుకుని చెప్పాలో తెలీడం లేదు.
మీరు ట్విటర్‌లో ఎందుకు లేరు?
ప్రభాస్‌: నేను సోషల్‌మీడియాలో అంత యాక్టీవ్‌గా ఉండను. ఈ మధ్యనే ఫ్యాన్స్‌ కోసమని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాను. కాబట్టి ఇప్పుడు ట్విటర్‌ తెరిచే ఆలోచనలు లేవు.

ప్రభాస్‌తో కలిసి నటించడం మీకెలా అనిపించింది?
శ్రద్ధ: ప్రభాస్‌ను ఫ్యాన్స్‌ అంతా డార్లింగ్‌ అని పిలుస్తారు. ఆ పదం ప్రభాస్‌కు 100 శాతం సరిపోతుంది. 
తెలుగు నేర్చుకోగలిగారా?
శ్రద్ధ: నేను సినిమాలో చెప్పిన తెలుగు డైలాగులన్నీ బాగా బట్టీ పట్టాను. అవి మాత్రం చెప్పగలను. కానీ తెలుగు మాట్లాడలేను. భాష రావాలంటే నేను మరిన్ని తెలుగు సినిమాలు చేయాల్సి ఉంటుంది.
హిందీ డైలాగులు చెబుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
ప్రభాస్‌: మా ఇంట్లో ఎవ్వరూ హిందీలో మాట్లాడరు. దాంతో నాకు రాయడం, చదవడం వచ్చింది కానీ మాట్లాడటం రాదు. అందుకే సెట్‌కు హిందీ ట్యూటర్‌ను పిలిపించాం.
భారత్‌ నుంచి ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’, ‘జేమ్స్‌ బాండ్‌’ తరహా సినిమాలు రాలేదు. ‘సాహో’ సినిమా ఆ స్థాయిలోనే ఉంటుందని చెప్పొచ్చా?
ప్రభాస్‌: దయచేసి ‘సాహో’ సినిమాను వాటితో పోల్చొద్దు. సినిమా కోసం మేం రెండేళ్లు చాలా కష్టపడ్డాం. సినిమా చూసి ప్రేక్షకులు ఇష్టపడితే అంతే చాలు అనుకుంటున్నా.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.