Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146042
            [news_title_telugu_html] => 

తెలుగు తెరపై తమిళ కళ!

[news_title_telugu] => తెలుగు తెరపై తమిళ కళ! [news_title_english] => kollywood storuies in Tollywood [news_short_description] => కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారనడానికి ప్రస్తుతం అక్కడి సినిమాలే చక్కటి ఉదాహరణ. ఇటీవల వరుసగా పలు తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్‌ ... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 08:56:55 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తెలుగు తెరపై తమిళ కళ! - kollywood storuies in Tollywood - EENADU
close

తాజా వార్తలు

తెలుగు తెరపై తమిళ కళ!
కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారనడానికి ప్రస్తుతం అక్కడి సినిమాలే చక్కటి ఉదాహరణ. ఇటీవల వరుసగా పలు తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్‌ అవుతున్నాయి. అవన్నీ అక్కడా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘రాక్షసన్‌’ ఇటీవల తెలుగులో ‘రాక్షసుడు’గా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంకా పలు తమిళ చిత్రాలు తెలుగు తెరపై తళుక్కున మెరిసి ఆదరణ పొందుతున్నాయి. కొన్ని విడుదలకు సిద్ధంగా ఉండగా మరికొన్ని నిర్మాణ పూర్వ పనుల్లో బిజీగా ఉన్నాయి.

 

‘రాక్షసన్‌’                                        ‘రాక్షసుడు’

 

విష్ణు, అమలాపాల్‌ జంటగా రామ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసన్‌’. సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో కూడుకున్న ఈ సినిమాలో చివరి వరకు విలన్‌ ఎవరనే సస్పెన్స్‌ కొనసాగుతుంది. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగులో ‘రాక్షసుడు’ పేరిట రీమేక్‌ అయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటించారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. జిబ్రాన్‌ సంగీతానికి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా హిందీలో కూడా రీమేక్‌ కానుంది. ఈ హక్కులను తమిళ హీరో విష్ణు సొంతం చేసుకున్నారు.

 

   ‘జిగర్‌దండా’                                                ‘వాల్మీకి’

రౌడీ జీవితం ఆధారంగా...

కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘జిగర్‌దండా’. 2014 విడుదలైన ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, బాబిసింహా తదితరులు నటించారు. మదురైలోని ఓ ప్రముఖ రౌడీ పాత్రలో కనిపిస్తారు బాబిసింహా. అతని జీవితం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిచ్చే దర్శకుడిగా సిద్ధార్థ్‌ నటించారు. ఈ సినిమానే బాబిసింహాకు జాతీయ ఉత్తమ సహాయ నటుడు పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. 2016లో ‘చిక్కడు దొరకడు’గా అనువాదమైంది. అయినప్పటికీ ఈ చిత్రం తెలుగులో ‘వాల్మీకి’గా రీమేక్‌ అవుతోంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాబిసింహా పాత్రలో వరుణ్‌తేజ్‌, సిద్ధార్థ్‌ పాత్రలో అధర్వ నటిస్తున్నారు. తమిళ హీరో అధర్వకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. లక్ష్మీమేనన్‌ పాత్రలో పూజాహెగ్డే నటిస్తోంది.

మనసును హత్తుకునే ‘96’

‘96’.. ఈ సినిమా పేరు చెబితే చాలు యువకుల మనసులో ‘కాదలే.. కాదలే..’ అనే పాట మోగుతుంటుంది. ఆ స్థాయిలో వారి మనసును ముఖ్యంగా 1980లలో పుట్టినవారిని అమితంగా ఆకట్టుకుంది. విజయ్‌ సేతుపతి నటన ఓ ఎత్తయితే.. త్రిష హావభావాలు మరో ఎత్తని చెప్పాలి. ఈ ట్రెండ్‌లోనూ ఇలాంటి ప్రేమ కథా చిత్రాలు విజయాన్ని సాధిస్తాయని చాటిచెప్పిన చిత్రమిది. తెలుగులో అదే పేరిట రీమేక్‌ అవుతోంది. శర్వానంద్‌ హీరో. త్రిష పాత్రలో సమంత నటిస్తోంది. ఈ కథ తెలుగు ప్రేక్షకులను కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని సంబంధిత వర్గాలు ధీమాగా ఉన్నాయి.

మరిన్ని చిత్రాలు..
అరుణ్‌ విజయ్‌ హీరోగా నటించిన ‘తడం’ చిత్రం కూడా తెలుగు రీమేక్‌ అవుతోంది. స్రవంతి రవికిశోర్‌ ఈసినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. రామ్‌ హీరోగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రైం థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమా అరుణ్‌ విజయ్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘విక్రం వేదా’ చిత్రం కూడా తెలుగులో త్వరలోనే రీమేక్‌గా వచ్చే అవకాశముందని సమాచారం. ‘నేర్‌కొండ పార్వై’ హిందీ రీమేక్‌ అయినప్పటికీ, తమిళ విజయంతో ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్‌ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వీటితోపాటు మరిన్ని తమిళ చిత్రాలు తెలుగు వాకిలిలో వినోదాన్ని పరిచేందుకు సమాయత్తం అవుతున్నాయి. అధర్వ హీరోగా నటించిన ‘గణితన్‌’ కూడా ‘అర్జున్‌ సురవరం’గా తెలుగులోకి రీమేక్‌ అవుతోంది. ఇందులో నిఖిల్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు.

‘కనా’                                    ‘కౌలస్య కృష్ణమూర్తి’

‘కౌసల్య కృష్ణమూర్తి’గా ‘కనా’

పల్లెటూరిలో పుట్టి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగే ఓ సాధారణ అమ్మాయి కథతో రూపొందిన చిత్రం ‘కనా’. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని కమర్షియల్‌ చిత్రాల హీరోగా మారిన శివకార్తికేయన్‌ ఈ సినిమాతోనే నిర్మాత అవతారం ఎత్తారు. తమిళంలో ఐశ్వర్యా రాజేష్‌, సత్యరాజ్‌ తదితరులు నటించారు. కోచ్‌గా శివకార్తికేయన్‌ కనిపించి, కథకు మంచి బలాన్ని చేకూర్చారు. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్‌ అవుతోంది. ఐశ్వర్యారాజేష్‌ అదే పాత్రలో నటిస్తోంది. సత్యరాజ్‌ పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ నటించారు. తాజాగా ప్రీరిలీజ్‌ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలోని ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.