Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000450
            [news_title_telugu_html] => 

ఇది విద్యా బాలన్‌ ‘కహానీ’

[news_title_telugu] => ఇది విద్యా బాలన్‌ ‘కహానీ’ [news_title_english] => From Silk Smitha to Shinde Vidya Balan has shattered the glass ceiling with her versatility and craft [news_short_description] => చూడటానికి తెలుగమ్మాయిలా కనిపిస్తారు. కమర్షియల్‌ హీరోయిన్‌కు ఉండాల్సిన ఫిగర్‌ లేకపోయినా ఆమె గొప్ప నటీమణి.  కథలను ఎంపికచేసుకోవడం కాదు.. కథలే ఆమెను వెతుక్కుంటూ వస్తాయి. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 09:41:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఇది విద్యా బాలన్‌ ‘కహానీ’ - From Silk Smitha to Shinde Vidya Balan has shattered the glass ceiling with her versatility and craft - EENADU
close

తాజా వార్తలు

ఇది విద్యా బాలన్‌ ‘కహానీ’

చూడటానికి తెలుగమ్మాయిలా కనిపిస్తారు. కమర్షియల్‌ హీరోయిన్‌కు ఉండాల్సిన ఫిగర్‌ లేకపోయినా ఆమె గొప్ప నటీమణి.  కథలను ఎంపికచేసుకోవడం కాదు.. కథలే ఆమెను వెతుక్కుంటూ వస్తాయి. ఈ కిరీటాలన్నీ దక్కించుకున్నది ఎవరో కాదు బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌. ‘డర్టీ పిక్చర్‌’ సినిమా నుంచి ఇప్పుడు చేయబోతున్న శకుంతలా దేవి బయోపిక్‌ వరకు ఆమె నటించిన పాత్రలన్నీ మహిళలు మెచ్చినవే. విద్యా బాలన్‌ను ఓ నటిగా ఒక్కో మెట్టు ఎక్కిస్తూ వచ్చిన సినిమాలేంటో చూద్దాం.

పరిణీత

హిళా నేపథ్యం ఉన్న సినిమా మొత్తాన్ని విద్యా బాలన్‌ నడిపించగలరు అని నిరూపించిన సినిమా ఇది. ఈ సినిమాతోనే విద్య బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ సమయంలో వచ్చిన కథానాయికల్లో విద్య ది బెస్ట్‌గా నిలిచారు. ఇందులో షారుక్‌ ఖాన్‌ను కథానాయకుడిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ, విద్యా బాలన్‌కు అప్పట్లో అంతగా స్టార్‌డం లేకపోవడంతో సినిమాకు నో చెప్పారట. దాంతో ఆయన పాత్రను సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించారు. సినిమాలో సైఫ్‌, సంజయ్‌దత్‌ లాంటి పెద్ద స్టార్స్‌ ఉన్నప్పటికీ విద్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

ది డర్టీ పిక్చర్‌

పేరు వినగానే అందరూ అలనాటి నటి సిల్క్‌ స్మిత బయోపిక్‌ అనుకుంటారు. సినిమా అంతా ఆమె జీవితాన్ని పోలి ఉన్నప్పటికీ అది సిల్క్‌ స్మిత బయోపిక్‌ కాదు. మరో విషయం ఏంటంటే.. ఇందులో నటిస్తే కెరీర్‌ నాశనమవుతుందని చాలా మంది విద్యకు చెప్పారట. కానీ ఆమె దర్శకుడు మిలాన్‌పై నమ్మకం ఉంచి.. ఓ నటి జీవితం ఎలా ఉంటుందో తెరపై చూపించేందుకు ఒప్పుకొన్నారు.

తుమ్హారీ సులు

గృహిణి అంటే కేవలం ఇంటి పనులకే ఎందుకు పరిమితం అవ్వాలి? అని ప్రేక్షకుల్లో ఓ ఆలోచనను రేకెత్తించిన సినిమా ఇది. అందులోనూ విద్యా బాలన్‌ ప్రధాన పాత్రలో నటించడంతో సినిమా మరో స్థాయిలో నిలిచింది. లేట్‌ నైట్‌ రేడియో జాకీ సులోచన పాత్రలో విద్య అదరగొట్టేశారు. భావోద్వేగపు సన్నివేశాన్ని ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు. తన హాస్య చతురత, చిలిపితనంతో నవ్వించారు. ఈ సినిమా ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది కాబట్టే తమిళంలో ‘కాట్రిన్‌ మొళి’ టైటిల్‌తో రీమేక్‌ చేశారు. జ్యోతిక నటించిన ఈ సినిమా అక్కడి కూడా మంచి విజయం సాధించింది.

నో వన్‌ కిల్డ్‌ జెస్సికా

జెస్సికా లాల్‌ అనే యువతి హత్య ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో విద్య జెస్సికా సోదరి సబ్రినా పాత్రలో నటించారు. సినిమాలో తన సోదరికి న్యాయం జరగాలంటూ ఆమె పోరాడిన తీరు హైలైట్‌గా నిలుస్తుంది. సొంత సోదరికి జరిగినట్లుగా ఆమె పాత్రలో ఒదొగిపోయి నటించారు.

కహానీ

సుజాయ్‌ ఘోష్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో విద్య గర్భిణిగా నటించారు. సినిమా మొత్తం విద్య తప్పిపోయిన భర్త కోసం వెతుకుతూనే ఉంటుంది. సినిమా కాన్సెప్ట్‌, విద్యా బాలన్‌ నటన హైలైట్‌గా నిలిచాయి. అందుకే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 2016లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘కహానీ 2’ వచ్చింది. అయితే సినిమా కథ అంతగా బాలేదంటూ విమర్శలు వచ్చాయి. కానీ ఎప్పటిలాగే విద్యకు మాత్రం నూటికి నూరు మార్కులు పడ్డాయి.

ఎన్టీఆర్‌ బయోపిక్‌

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా వచ్చిన ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌: మహానాయకుడు’ చిత్రాల్లో విద్య నటించారు. ఇందులో ఆమె ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రను పోషించారు. తారకమ్మ పాత్రలో విద్యను తప్ప మరొకరిని ఊహించుకోలేం అన్న స్థాయిలో విద్య నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.  

మిషన్‌ మంగళ్‌

టీవల విడుదలైన చిత్రమిది. అక్షయ్‌ కుమార్‌ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రలో విద్య నటించారు. ఇందులో ఆమెది తారా షిండే అనే శాస్త్రవేత్త పాత్ర. ‘పూరీలు కాల్చేటప్పుడు నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి పొయ్యి కట్టేసినా పొంగుతాయి సర్‌. అదే విధంగా ఆర్బిటర్‌ ఇంధనాన్ని కూడా మనం సేవ్‌ చేసుకోవాలి’ అనే డైలాగ్‌ ఉంది. ఈ డైలాగ్‌ చెప్పేటప్పుడు విద్య ఎక్స్‌ప్రెషన్స్‌, నటన అద్భుతంగా ఉన్నాయట. సినిమా మొత్తంలో ఆమె చేసిన హడావుడి, ఎగ్జైట్‌ అవుతూ చెప్పే డైలాగులు ప్లస్‌పాయింట్‌గా నిలిచాయి.

శకుంతలా దేవి బయోపిక్‌

భారత హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరుగాంచిన గణితవేత్త శకుంతలా దేవి బయోపిక్‌లో విద్య నటిస్తున్నారు. అను మేనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ పాత్ర కోసం విద్య బాగా సన్నద్ధం అవుతున్నారు. ‘ఎటూ దక్షిణాది మహిళనే. కాస్త హెయిర్‌స్టైల్‌ మారిస్తే అచ్చం దేవిలాగే ఉంటాను’ అని ఈ సినిమా గురించి విద్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.