Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000561
            [news_title_telugu_html] => 

సర్‌.. చిరుకు ఎప్పుడైనా కథ చెప్పారా

[news_title_telugu] => సర్‌.. చిరుకు ఎప్పుడైనా కథ చెప్పారా [news_title_english] => harish shanker twitter chat [news_short_description] => చాలా కాలం తర్వాత ‘వాల్మీకి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో హరీశ్‌... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 00:15:08 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సర్‌.. చిరుకు ఎప్పుడైనా కథ చెప్పారా - harish shanker twitter chat - EENADU
close

తాజా వార్తలు

సర్‌.. చిరుకు ఎప్పుడైనా కథ చెప్పారా

ఫ్యాన్స్‌ ప్రశ్నలు.. హరీశ్‌ శంకర్‌ సమాధానాలు

హైదరాబాద్‌: చాలా కాలం తర్వాత ‘వాల్మీకి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో హరీశ్‌ అభిమానులతో ట్విటర్‌లో కాసేపు చాట్‌ చేశారు. వాళ్ల ప్రశ్నలేంటో.. వీటికి ఆయనిచ్చిన సమాధానాలేంటో చదివేయండి.
రామ్‌చరణ్‌తో సినిమా ఎప్పుడు చేస్తారు సర్‌?
హరీశ్‌ శంకర్‌: త్వరలో.
‘వాల్మీకి’, ‘గ్యాంగ్‌లీడర్‌’ ఒకే రోజు బాక్సాఫీస్‌ వద్ద ఢీకొనబోతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
హరీశ్‌ శంకర్‌: అది ఢీకొనడం కాదు. కలిసి విడుదల కాబోతున్నాయి. సినీ ప్రియులకు ఇక పండగే.
‘వాల్మీకి’ సినిమాలోని మరో పాటను ఎప్పుడు విడుదల చేస్తారు?
హరీశ్‌ శంకర్‌: మరో రెండు, మూడు రోజుల్లో
చిరంజీవికి ఒక్కసారైనా కథ చెప్పారా?
హరీశ్‌ శంకర్‌: లేదు. కానీ చెప్పాలని ఉంది.
‘జిగర్తాండ’ సినిమాను ఉన్నది ఉన్నట్లే కాపీ కొట్టారా? లేక మార్చారా?
హరీశ్‌ శంకర్‌: అది సస్పెన్స్‌.
‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నారు. ‘వాల్మీకి’ సినిమా కోసమా?లేక సినిమాలు వర్కవుట్‌ కాలేదా?
హరీశ్‌ శంకర్‌: మరో సినిమా వర్కవుట్‌ అవ్వలేదు.

సినిమాకు ‘వాల్మీకి’ అన్న పేరెందుకు పెట్టారు?
హరీశ్‌ శంకర్‌: మనిషి మహర్షిగా మారాడు కాబట్టి. ఆయనపై గౌరవంతో ఈ టైటిల్‌ పెట్టాను.
నానితో సినిమా ఉంటుందా?
హరీశ్‌ శంకర్‌: ఉంటుంది.
మహేశ్‌బాబు గురించి ఒక్క మాటలో చెప్పండి?
హరీశ్‌ శంకర్‌: ఆయనతో కలిసి పనిచేయాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ‘పోకిరి’ లాంటి సినిమాను చేయాలనుంది.

ఎక్కువగా రీమేక్‌లు ఎందుకు చేస్తున్నారు?
హరీశ్‌ శంకర్‌: కదా.. తగ్గిద్దాం.
తర్వాతి సినిమా సొంత కథతోనా?మళ్లీ రీమేకా?
హరీశ్‌ శంకర్‌: ఏది నచ్చితే అది.

‘వాల్మీకి’ వాయిదా వేయండన్నా.. ఒకేరోజు రెండు సినిమాలు ఎందుకు?
హరీశ్‌ శంకర్‌: కష్టం బ్రో.
‘వాల్మీకి’ ట్రైలర్‌ ఎప్పుడు విడుదల చేస్తారు?
హరీశ్‌ శంకర్‌: సెప్టెంబర్‌ మొదటి వారంలో.
చరణ్‌, నాని, మహేశ్‌.. ఇంకా చాలా కథలు ఉన్నట్లున్నాయ్‌?
హరీశ్‌ శంకర్‌: చాలా కథలతో, కలలతో ఇండస్ట్రీకి వచ్చా మరి.
తారక్‌పై మీ అభిప్రాయం?
హరీశ్‌ శంకర్‌: టైగర్‌.
రవితేజ కొత్త లుక్‌ ఎలా ఉంది?
హరీశ్‌ శంకర్‌: దిమ్మతిరిగేలా ఉంది.
సినిమాకి పారితోషికం ఎంత తీసుకున్నావ్‌ భయ్యా?
హరీశ్‌ శంకర్‌: కావాల్సినంత.
మీకు కరెక్ట్‌ స్టోరీ దొరకట్లేదు. మంచి కథ పడితే మళ్లీ ఒక ‘గబ్బర్‌ సింగ్‌’ చూడొచ్చు.
హరీశ్‌ శంకర్‌: రాస్కుంటా సాంబా..
ఈ సినిమాలోనూ బాబీ సింహా పాత్రను తీసుకోవచ్చు కదా?
హరీశ్‌ శంకర్‌: అవును కదా.. అరెరె ఆలస్యమైంది. ఇప్పుడు చెబితే ఎలా.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.