Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001470
            [news_title_telugu_html] => 

దీపావళికి భారీ వినోదం

[news_title_telugu] => దీపావళికి భారీ వినోదం [news_title_english] => New Release For Diwali [news_short_description] => ఇటీవల సంక్రాంతికి వచ్చిన వినోదాన్ని తమిళ ప్రేక్షకులు ఏమాత్రం మరిచిపోలేరు. ఎందుకంటే, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘పేట’, అజిత్‌ నటించిన ‘విశ్వాసం’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలో పోటీపడి మరీ విజయాలను [news_tags_keywords] => Karthi,Vijay,Kollywood [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 08:30:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
దీపావళికి భారీ వినోదం - New Release For Diwali - EENADU
close

తాజా వార్తలు

దీపావళికి భారీ వినోదం

●3 పెద్ద చిత్రాల విడుదలకు సన్నాహాలు

●బరిలో విజయ్‌, కార్తి, విజయ్‌ సేతుపతి

‘బిగిల్‌’

కోడంబాక్కం, న్యూస్‌టుడే : ఇటీవల సంక్రాంతికి వచ్చిన వినోదాన్ని తమిళ ప్రేక్షకులు ఏమాత్రం మరిచిపోలేరు. ఎందుకంటే, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘పేట’, అజిత్‌ నటించిన ‘విశ్వాసం’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలో పోటీపడి మరీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇద్దరి అభిమానులూ జోష్‌లో మునిగితేలారు. ఇప్పుడు రానున్న దీపావళికి ఏకంగా మూడు సినిమాలు భారీ వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. ‘తలబది’ విజయ్‌, కార్తి, విజయ్‌ సేతుపతిలు పోటీపడుతుండటం విశేషం. ఎప్పటినుంచో దీపావళి రేసులో విజయ్‌ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కార్తి, విజయ్‌ సేతుపతి కూడా చేరారు.

నువ్వు.. విజిలేస్తే!

దర్శకుడు అట్లి, నటుడు విజయ్‌ కాంబినేషన్‌ అంటేనే కోలీవుడ్‌లో హిట్‌ అనే ముద్ర పడిపోయింది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘తెరి’, ‘మెర్సల్‌’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ హిట్లుగా నిలిచాయి. దీంతో ఇప్పుడు హ్యాట్రిక్‌ను సొంతం చేసుకునేందుకు ‘బిగిల్‌’ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయిక. వివేక్‌, కదిర్‌, డేనియల్‌ బాలాజీ, రాజ్‌కుమార్‌ తదితరులు నటిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అప్పుడే ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవలే సింగిల్‌ ట్రాక్‌ను కూడా విడుదల చేశారు. త్వరలోనే రెండో పాటను కూడా ఆవిష్కరిచనున్నారు. మహిళల ఫుట్‌బాల్‌ కథాంశంతో సినిమాను రూపొందించారు. క్రీడా నేపథ్యమున్న కథ కావడం వల్ల ‘బిగిల్‌’ అని పేరు పెట్టారు. విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

కార్తి జోరు..

వరుస విజయాలతో దూసుకెళ్తున్న కార్తి ‘ఖైదీ’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మాత. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం సమకూర్చుతున్నారు. నరేన్‌, జార్జ్‌ మరియాన్‌, రమణ తదితరులు నటిస్తున్నారు. నిజానికి విజయ్‌ సినిమా దీపావళికి వస్తున్నందువల్ల మరెవరూ ఆ సమయంలో చిత్రాల విడుదలపై దృష్టి పెట్టలేదు. కానీ ఉన్నట్టుండి కార్తి బరిలోకి దిగారు. బలమైన కథతోపాటు కార్తి నటన కూడా అద్భుతంగా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. అందువల్లే దీపావళికి పోటీగా వస్తోందని సమాచారం.

ఆశ్చర్యపరుస్తున్న విజయ్‌ సేతుపతి

విజయా ప్రొడక్షన్స్‌లో విజయ్‌ సేతుపతి నటిస్తున్న చిత్రం ‘సంగ తమిళన్‌’. భారతిరెడ్డి నిర్మాణంలోని ఈ చిత్రానికి విజయ్‌ చందర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాశిఖన్నా, నివేదాపెత్తురాజ్‌లు కథానాయికలు. సూరి, నాజర్‌, జాన్‌ విజయ్‌లు ఇతర తారాగణం. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఆదివారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించాయి. దీంతో పలువురు సినీ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే రెండు చిత్రాలు బరిలో ఉన్నప్పుడు విజయ్‌ సేతుపతి కూడా పోటీ పడుతుండటం విశేషం. మరి దీపావళి కలెక్షన్లలో ఎవరూ టాప్‌గా నిలుస్తారో వేచిచూడాలి. ఏటా దీపావళి ధమాకాను అందించే విజయ్‌ ఈ సారి పోటీని ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది.

‘ఖైదీ’


‘సంగ తమిళన్‌’

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.