
తాజా వార్తలు
హైకోర్టులో పిటిషన్
చెన్నై: తమిళ స్టార్ సూర్య నటించిన ‘కాప్పాన్’ సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమా కథ తనదని రచయిత జాన్ చార్లెస్ ఆరోపించారు. కేవీ ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మోహన్‌లాల్, ఆర్య, సాయేషా సైగల్ కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. సెప్టెంబరు 20న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.
కాగా ఈ కథ తనదంటూ మద్రాస్ హైకోర్టులో జాన్ చార్లెస్ పిటిషన్ వేశారు. ‘సరవేది’ టైటిల్‌తో తను రాసుకున్న కథతో ఆనంద్ చిత్రం తీశారని ఆరోపించారు. 2017లో ఈ సినిమా కథను ఆనంద్‌కు నరేట్ చేశానని, రెండేళ్లుగా ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. కానీ ఇటీవల వచ్చిన ‘కాప్పాన్’ ట్రైలర్ చూసి షాక్ అయ్యానని తెలిపారు. కాపీరైట్ ఫీజుతోపాటు కథకు క్రెడిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబరు 4న ఈ కేసు వాదోపవాదాలను కోర్టు విననుంది. ఇంకా ఈ వివాదంపై చిత్ర బృందం స్పందించలేదు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ కథను కాపీ కొట్టే అంశం గురించి ప్రస్తావించారు. ‘‘నా వద్ద ఓ కథ ఉంది. విని మీ అభిప్రాయం చెప్పండి’ అని ఎవరైనా అడిగితే, ఏ మాత్రం మొహమాటం లేకుండా వద్దని చెప్పేస్తా. వింటే.. వారి కథలోని ఓ సన్నివేశం నా సినిమాలో ఉంటే ఆ సన్నివేశాన్ని తొలగించాల్సి వస్తుంది. లేకుంటే.. నా కథ విని, అందులోని సన్నివేశాలను కాపీ చేశారని జెండా పట్టుకొస్తారు. అందుకే ఎవరి కథలు వినడం లేదు’ అని అన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
