close

తాజా వార్తలు

మరో 11రోజుల్లో జాబిల్లి చెంతకు చంద్రయాన్‌ 2

విజయవంతంగా మూడోసారి కక్ష్య కుదింపు 

బెంగళూరు: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2 మరో 11 రోజుల్లో జాబిల్లి చెంతకు చేరనుంది. ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 విజయవంతంగా మరో దశను దాటింది. బుధవారం ఉదయం 9.04 గంటలకు మూడోసారి కక్ష్య కుదింపు ప్రక్రియ చేపట్టారు. ప్రపల్షన్‌ సిస్టమ్‌ను 20 నిమిషాల పాటు మండించి వ్యోమనౌకను 179 x 1412 కిలోమీటర్ల కక్ష్యలోకి తీసుకొచ్చారు. దీంతో చంద్రయాన్‌-2 జాబిల్లికి మరింత చేరువైంది. 

నాలుగో కక్ష్య కుదింపు ప్రక్రియను ఆగస్టు 30 సాయంత్రం 6-7 గంటల మధ్య నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. ఆ విన్యాసం పూర్తయిన తర్వాత కక్ష్య ఆకారం గుండ్రంగా మారుతుందని వెల్లడించింది. సెప్టెంబరు 7న జాబిల్లిపైన దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రయాన్‌-2 అడుగుపెట్టనుంది.  ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయే ప్రక్రియ సెప్టెంబరు 2న ప్రారంభమవుతుందనేది తెలిసిందే. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.