close

తాజా వార్తలు

‘సాహో’ అభిమానులకు బంపర్‌ ఆఫర్‌

రెండు ప్రత్యేక షోలకు అనుమతి

హైదరాబాద్‌: ‘సాహో’ అభిమానులకు బంపర్‌ ఆఫర్‌. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణంగా ప్రదర్శించే నాలుగు షోలు కాకుండా అదనంగా రెండు ప్రత్యేక షోలను నిర్వహించనున్నారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 5 వరకు తెల్లవారుజామున 1 గంట నుంచి 10 గంటల మధ్య ఈ షోలను ప్రదర్శిస్తారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ వినతి మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమా ఇది. ఈ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగు, హిందీతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.