close

తాజా వార్తలు

ఈ యాప్‌ వాడితే మీరు హీరోలుగా కనిపిస్తారు..

బీజింగ్‌ : మనం సినిమాలు చూసే సమయంలో హీరో స్థానంలో మనల్ని ఊహించుకుంటాం. అయితే సినిమా ముగిసిన అనంతరం తిరిగి సాధారణ స్థితికి వస్తాం. టైటానిక్‌ హీరో. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ సినిమాలు చూసినప్పుడు ఆ హీరోలు చేసే నటన ఆకట్టుకుంటుంది. సినిమా హీరోల మీద అభిమానంతో అదే తీరులో నటించాలని ఉన్నా  అది ఆశగానే మిగిలిపోతుంది.

 చైనాకు చెందిన ఒక సంస్థ ఝవొ అనే యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌లో మన ఫొటోను అప్‌లోడ్‌చేస్తే చాలు. మనకు కావాల్సిన సినిమాకు వెళ్లి  అందులో ఏదైనా ఒక సన్నివేశాన్ని ఎంచుకోవాలి. వెంటనే ఆ సన్నివేశంలో మనం ఎంచుకున్న పాత్రలో నటుడి ముఖం మాయమై మనం అప్‌లోడ్‌ చేసిన వ్యక్తి చిత్రం కనిపిస్తుంది. అచ్చం మన నటించినట్టే  ఉంటుంది. చైనాలోని ఐవోఎస్‌ స్టోర్లో దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకునే  సౌకర్యాన్ని కల్పించారు.

చైనా సోషల్‌ మీడియాలో ఈ యాప్‌ సంచలనం సృష్టించింది. ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది. అయితే దీని ద్వారా ప్రైవసీకి భంగం కలుగుతుందని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 


 




Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.