close

తాజా వార్తలు

బ్రహ్మీతో.. ఎంత మందికో ఈ అదృష్టం..!

ట్విటర్‌లో హరీష్‌ శంకర్‌

హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంతో దర్శకుడు హరీష్‌ శంకర్‌ స్నేహ బంధం మరింత బలపడినట్లు తెలుస్తోంది. బ్రహ్మీ స్వయంగా తనకు భోజనం వడ్డిస్తున్న ఫొటోను హరీష్‌ బుధవారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ఎంత మందికో ఈ అదృష్టం.. సినిమాకు రుణపడి ఉన్నాను. ‘వాల్మీకి’ సినిమా చివరిరోజు షూటింగ్‌ ఫుల్‌ సర్‌ప్రైజ్‌లతో నిండిపోయింది’ అని పోస్ట్‌ చేశారు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

‘వాల్మీకి’ సినిమాలో వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్నారు. సెప్టెంబరు 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ మాస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలోని ‘గగన వీధిలో..’ అనే పాట లిరికల్‌ వీడియోను బుధవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.