
తాజా వార్తలు
ఏది బొమ్మ, ఏది ఒరిజనలో చెప్పండి చూద్దాం
సినిమా హిట్ అయితే ‘బొమ్మ అదిరింది’ అంటుంటారు మన సినిమావాళ్లు. అలాంటి సినిమావాళ్ల బొమ్మలు అదిరిపోయేలా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం తయారు చేయిస్తుంటుంది. ఈ రోజు అతిలోకసుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు. ఇలా మైనంతో తయారు చేసిన ఆ బొమ్మలు చూడటానికి అచ్చంగా మనిషిలా, ముట్టుకుంటే డాగు పడిపోయేలా, మరీ చూస్తే దిష్టి పడిపోయేలా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ మనిషిని, మైనపు బొమ్మను పక్కపక్కన పెడితే ఏది బొమ్మో, ఏది నిజమో చెప్పడం చాలా కష్టం. కాదంటారా.. అయితే మీరే చూడండి.
- ఇంటర్నెట్ డెస్క్
![]() శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వి, ఖుషీ కలసి ఈ రోజు శ్రీదేవి మైనపు బొమ్మను ఆవిష్కరించారు. ‘మిస్టర్ ఇండియా’లోని ‘హవా హవాయి...’ పాట లుక్‌లో శ్రీదేవి విగ్రహం అదిరిపోయింది. |
అమితాబ్ ట్రేడ్ మార్క్ అయిన తెల్ల గడ్డంను.. ఆయనే చూసి ముచ్చటపడుతున్నట్లుగా ఉంది కదా ఈ ఫొటో. 2017 జనవరిలో అమితాబ్ బచ్చన్ మైనపు బొమ్మను దిల్లీ మ్యూజియంలో ఆవిష్కరించినప్పటి క్లిక్ ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేడమ్ టుస్సాడ్స్‌లో ఆరు బిగ్‌బీ విగ్రహాలు ఉన్నాయి. |
![]() ఆశా భోస్లే పాట పాడతే చెవిలో అమృతం పోసినట్లు ఉంటుంది అంటుంటారు. ఇక్కడ ఇద్దరు పాడుతున్నారు మరి. ఇంకెలా ఉంటుందో. ప్రముఖ గాయని ఆశా భోస్లే మైనపు విగ్రహాన్ని అక్టోబరు 3, 2017లో దిల్లీలో ఆవిష్కరించారు. |
నీలి కళ్ల సుందరిని చూడటానికి రెండు కళ్లూ చాలవు. అలాంటిది ‘డబుల్’ బొనాంజా కనిపిస్తే ఇంకేమన్నా ఉందా. కళ్లు జిగేల్ మంటాయి. 2004 అక్టోబరులో ఐష్ మైనపు బొమ్మ ఆవిష్కరణ సమయంలో చిక్కిందీ ఫొటో. |
కళ్లు మూసుకొని కిలకిల నవ్వే కాజోల్... ఇక్కడేంటి సెల్ఫీ తీసుకుంటోంది అనుకుంటున్నారా... తనలాగే కనిపిస్తున్న బొమ్మ చూసేసరికి ఆమెకు మనసాగలేదు లెండి. 2018 మేలో ఆమె మైనపు బొమ్మ లాంచ్ చేసిన సందర్భంలోని ఫొటో ఇది. |
ఏక్ దో తీన్ అంటూ... ఆ రోజుల్లో కుర్రకారు గుండెల్లో ప్రేమ గుబులు పుట్టించిన మాధురీ... తన బొమ్మను చూసి మురిసిపోతున్న ఈ క్లిక్ 2012లో లండన్ మ్యూజియంలోనిది. ఆ తర్వాత సింగపూర్, దిల్లీలోనూ రెండు విగ్రహాలు పెట్టారు. |
బాలీవుడ్ బార్బీ బొమ్మ... కత్రినా కైఫ్ రెండు పోజుల్లో ఏది బాగుంది అంటే ఏం చెప్పగలం. ఆమె మైనపు విగ్రహం సమయంలోనూ ఇలాంటి ప్రశ్నలే వచ్చాయి. రెండూ బాగున్నాయి... అందులో బ్లాక్ డ్రెస్ పోజ్ చాలా బాగుంది అన్నారట. ఎందుకంటే బ్లాక్ డ్రెస్ ఒరిజినల్ కదా. అన్నట్లు ఇది 2015లో క్లిక్ చేసిన ఫొటో. |
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ట్రేడ్ మార్క్ పోజ్ కాకుండా ఇలా ఉన్నాడేంటి అనుకుంటున్నారా? ఇది తాజా విగ్రహం లెండి. ‘ఫ్యాన్’ సినిమా ప్రచారంలో భాగంగా ఇలా ఆ సినిమా డ్రెస్‌లో చేయించారు. ఇది కాకుండా షారుఖ్‌కు మరో మూడు మైనపు విగ్రహాలున్నాయి. మొత్తంగా లండన్, న్యూయార్క్, లాస్ఏంజిలెస్, హాంకాంగ్, వాషింగ్టన్లో ఇవి ఉన్నాయి. |
బెబో తన అందంతో ఎప్పుడూ అబ్బో అనిపిస్తుంటుంది. 2011లో ఇలాగే తన మైనపు విగ్రహం పక్కన నిల్చొని మురిపించింది. చిరునవ్వులు చిందిస్తూ ఏది బొమ్మ.. ఏది ఒరిజినలో చెప్పండి అని సవాలు విసిరింది. |
ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్‌స్టార్ అయ్యింది. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఆమె పేరు మారుమోగుతోంది. ఆమె మైనపు విగ్రహాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్‌లో తొలి విగ్రహం ఆవిష్కరించారు. జూన్‌లో లండన్‌లో విగ్రహం ఏర్పాటు చేశారు. ఇంకా రెండు చోట్ల త్వరలో విగ్రహాలు ఏర్పాటు చేస్తారట. |
ఎవరబ్బా ఈమె... నాకంటే బాగా నవ్వుతోంది అంటూ దీపికా పదుకొణె ఆశ్చర్యంగా చూస్తున్నట్లు ఉంది కదా ఈ పొటో. ఈ ఏడాది మార్చిలో తన మైనపు బొమ్మ ఆవిష్కరణ సమయంలో తీసిన ఫొటో ఇది. ఈ సందర్భంగా దీపిక భర్త రణ్వీర్ సింగ్ చేసిన సందడి అంతాఇంతా కాదు. |
మేడమ్ టుస్సాడ్స్‌లో ఉన్న మైనపు బొమ్మల్లో అనుష్క శర్మది చాలా ప్రత్యేకం. ఎందుకంటే అనుష్క స్టాట్యూ సెల్ఫీలు తీస్తుంది. ఆ విగ్రహం దగ్గరకు వెళ్తే బొమ్మ చేతిలోని మొబైల్ కెమెరా ఆటోమేటిక్‌గా క్లిక్ అవుతుంది. అంతే కాదు బొమ్మ మిమ్మల్ని పలకరిస్తుంది కూడా. గతేడాది ఈ విగ్రహాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. |
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోని మైనపు విగ్రహాన్ని అంతే హాట్‌గా రూపొందించారు. సన్నీ వాడే సిగ్నేచర్ పర్ఫ్యూమ్ సువాసన ఆ విగ్రహం నుంచి వచ్చేలా మేడమ్ టుస్సాడ్స్ ఏర్పాట్లు చేసింది. గతేడాది ఈ బొమ్మను ఆవిష్కరించారు. |
‘బాహుబలి’తో నేషనల్‌స్టార్ అయిపోయాడు ప్రభాస్. అందుకే మేడమ్ టుస్సాడ్స్ వాళ్ల చూపు ప్రభాస్ మీద పడింది. వెంటనే బొమ్మ సిద్ధమైపోయింది. 2017 మేలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. |
ప్రిన్స్ మహేష్ బాబుతో సెల్ఫీ దిగాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఇక్కడ మహేషే సెల్ఫీ దిగుతున్నాడంటే ఆ వ్యక్తి ఎవరో స్పెషల్ అయి ఉండాలి. ఆ స్పెషలే అతని మైనపు విగ్రహం. ఈ ఏడాది మార్చిలో వ్యాక్స్ స్టాట్యూ ఆవిష్కరణ సందర్భంగా క్లిక్ చేసిన ఫొటో ఇది. |
షాహిద్ కపూర్ అంటే ఇప్పుడు అందరికీ కబీర్ సింగ్ సినిమానే గుర్తొస్తుంది. అంతగా ఆ పాత్రలో లీనమైపోయాడు. కానీ అంతకుముందు నీట్‌గా పై ఫొటోలాలా ఉండేవాడు. అందుకే మేడమ్ టుస్సాడ్స్ కూడా అలాంటి మైనపు విగ్రహాన్నే తయారు చేసింది. ఈ ఏడాది మార్చిలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. |
జకాస్... ఇది అనిల్ కపూర్ ట్రేడ్ మార్క్ డైలాగ్. ఫై ఫొటోను చూస్తే అభిమానులు అనే మాట కూడా ఇదే. 2017 ఏప్రిల్‌లో అనిల్ మైనపు విగ్రహం ఆవిష్కరించినప్పటి స్టిల్ ఇది. |
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ మైనపు విగ్రహాన్ని చూస్తే బొమ్మనా, ఒరిజినలా అనే డౌట్ కచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ హృతిక్ కుర్రాడిలానే కనిపిస్తాడు. బొమ్మ ఎలాగూ కుర్ర వయసులోనే చేసిందే కదా. 2011లో విగ్రహం ఆవిష్కరించిన సమయంలో ఫొటో ఇది. |
మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు కేవలం హీరోలు, హీరోయిన్లకే కాదు దర్శకనిర్మాతలకూ విగ్రహాలు పెట్టారు. అవును కరణ్ జోహార్‌కు అలాగే మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ విగ్రహాన్ని లాంచ్ చేశారు. |
కండలవీరుడు సల్మాన్ కు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారని తెలుసు గానీ... అచ్చంగా ఆయనలా ఉండరే అనుకుంటున్నారా. ఆగండాగండి... సల్మాన్ పక్కన ఉన్నది మనిషి కాదు. అయితే ఏది బొమ్మనేది మీరే తెలుసుకోవాలి. 2008లో సల్మాన్ మైనపు విగ్రహం ఆవిష్కరణ నాటి చిత్రమిది |
బాలీవుడ్లో చొక్కావిప్పి బాడీ చూపించే నటుల్లో వరుణ్ ధావన్ ఒకడు. వీలుచిక్కినప్పుడల్లా తన సిక్స్ ప్యాక్ చూపిస్తుంటాడు. అందుకే మేడమ్స్ టుస్సాడ్స్ వాళ్లు కూడా అలాంటి విగ్రహాన్నే చేశారు. గతేడాది జనవరిలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటి ఫొటో ఇది. |
కపూర్ ఖాందాన్ కుర్రాడు రణ్‌బీర్ కపూర్‌కూ మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఉంది. అయితే ఇంతవరకూ రణ్‌బీర్ ఆ విగ్రహంతో కలసి ఫొటో దిగలేదు. గతేడాది దిల్లీలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. |
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
