close

తాజా వార్తలు

చిరుతో జట్టుకట్టనున్న గోవా బ్యూటీ

హైదరాబాద్‌: ‘సైరా’ చిత్రం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడీగా గోవాబ్యూటీ ఇలియానా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం ఇలియానాను కలిసి కథను వివరించగా ఆమె ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాజల్‌ అగర్వాల్‌, అనుష్క పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

‘చరిత్రలో మనం ఉండక పోవచ్చు.. కానీ, చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో సాగే ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌ ఇటీవల విడుదలయ్యింది. మెగా అభిమానులనే కాకుండా సినీ ప్రేక్షకులను కూడా ఈ చిత్ర టీజర్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. భారత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ పతాకంపై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా తమిళ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటించనున్నారు. బాలీవుడ్‌ నటుడు అమితాబచ్చన్‌, జగపతిబాబు, విజయ్‌సేతుపతి, మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. 

2012లో విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత ఇలియానా నటించిన తెలుగు సినిమా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. రవితేజకు జోడీగా కనిపించిన ఈ సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇలియానా ‘పాగల్‌పంతీ’ అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు.
 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.