
తాజా వార్తలు
బెంగళూరు: కోట్ల మంది భారతీయుల దూతగా వ్యోమనౌక ‘చంద్రయాన్-2’ మరికొన్ని గంటల్లో గగన వీధిలో చందమామపై కాలుమోపనుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ 2లోని ‘విక్రమ్’ల్యాండర్ కదలికలపై ఇస్రో ఛైర్మన్ శివన్ స్పందించారు. అంతా తాము అనుకున్నట్టుగానే జరుగుతోందని అన్నారు. నెల వంకను అందే అపూర్వమైన చారిత్రక ఆవిష్కరణ కోసం తామెంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఇదో అత్యంత కీలకమైన రోజుగా ఆయన అభివర్ణించారు.
అయితే, చందమామపై అడుగు పెట్టేందుకు ఆఖరు 15 నిమిషాలు ఎంతో క్లిష్టమైనవని ఆయన అన్నారు. ఇప్పటివరకు ప్రయాణం ఒక ఎత్తైతే.. ఆ చివరి 15 నిమిషాలు చాలా చాలా సంక్లిష్టతతో కూడుకున్నదన్నారు. అప్పుడే పుట్టిన శిశువును అకస్మాత్తుగా మన చేతుల్లో పెడితే ఏ సాయం లేకుండా మనం పట్టుకోలేం. ఎటు కదులుతుందో తెలియక చాలా ఆందోళన పడతాం. అలాగే.. చంద్రయాన్ 2 కూడా చందమామపైకి ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. ఈ మనోహరమైన ఘట్టాన్ని దూరదర్శన్, ఇస్రో వెబ్సైట్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్లోనూ వీక్షించవచ్చని ఇస్రో అధికారులు వెల్లడించారు.
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.30 - 2.30గంటల మధ్య జాబిల్లి ఉపరితలంపై అడుగు పెట్టనుంది. ఈ వ్యోమ నౌక చెప్పబోయే కొత్త సంగతుల కోసం భారత్తో పాటు యావత్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జులై 22న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్2ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమైతే జాబిల్లిపై వ్యోమనౌకను సురక్షితంగా దించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై వ్యోమనౌకను దించిన తొలి దేశంగా మనం ఘనతి సాధించనున్నాం.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
