close

తాజా వార్తలు

వాటిలో సగం ప్రయోగాలు విఫలమే!

చంద్రయాన్‌-2పై స్పందించిన విదేశీ మీడియా

దిల్లీ: చంద్రయాన్‌-2 ప్రయోగం అసంపూర్తిగా నిలిచిన నేపథ్యంలో దీనిపై విదేశీ మీడియా స్పందించింది. చంద్రుడి ఉపరితలంపై తమ వ్యోమ నౌకలను సున్నితంగా దింపేందుకు వివిధ దేశాలు ఇప్పటివరకూ 38 ప్రయోగాలు చేపట్టాయని, వాటిలో దాదాపు సగం ప్రయోగాలు విఫలమయ్యాయని పేర్కొన్నాయి. ఈ ప్రయోగం విజయవంతం అయి ఉంటే మోదీ ప్రభుత్వానికి ఎంతో కలిసి వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం భారత జీడీపీ వృద్ధి రేటు పతనం, నిరుద్యోగం పెరగడం వంటి పరిస్థితుల్లో ఈ ప్రయోగ విజయం ప్రభుత్వానికి కొంత ఊరటనిచ్చేదని కథనాలు రాశాయి.

ఆ ప్రయోగాల్లో వైఫల్యాలు ఎక్కువగా ఉండే అవకాశం..
అయితే ఇజ్రాయెల్‌, భారత్‌ చేపట్టిన ప్రయోగాలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవని, 100 మిలియన్‌ నుంచి 150 మిలియన్‌ డాలర్ల లోపు ఖర్చు మాత్రమే అయిందని న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. తక్కువ ఖర్చుతో చేసే ప్రయోగాల్లో విఫలమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని వివరించింది. ‘‘భారత్‌ తన మొదటి ప్రయత్నంలో విఫలమై ఉండొచ్చు.. కానీ, ప్రయోగాన్ని నిర్వహించిన తీరు, ఇంజినీరింగ్‌ పరిజ్ఞానం.. అంతరిక్ష రంగంలో దూసుకుపోవాలన్న లక్ష్యాలకు అద్దం పడుతోంది.’’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొంది.

దిల్లీ విశ్వవిద్యాలయంలో భౌతిక, ఖగోళ భౌతిక శాస్త్రంలో ఆచార్యుడిగా పని చేస్తున్న పాత్రిక్‌దాస్‌ గుప్తా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. వ్యోమనౌక చంద్రుడి ఉపరితలం నుంచి 33.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పటి నుంచి అత్యంత క్లిష్టమైన ప్రక్రియ మొదలవుతుందని అన్నారు. దీన్ని చంద్రుడి నేల మీదికి దింపే వరకూ ప్రక్రియంతా కత్తి మీద సాములా ఉంటుందని పేర్కొన్నారు. శనివారం ఇస్రో అధిపతి శివన్‌ కూడా ఈ సమయాన్ని ‘15 నిమిషాల టెర్రర్‌’గా అభివర్ణించిన సంగతి తెలిసిందే.
గత ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌ కూడా చంద్రుడిపైకి నౌకను పంపగా అది చివరి నిమిషాల్లో చంద్రుడి గురుత్వాకర్షణకు ధ్వంసమైంది. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా మాత్రమే జాబిలి ఉపరితలంపై తమ వ్యోమ నౌకలను సున్నితంగా దింపగలిగాయి. చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా అవతరించాలన్న భారత కల ఆఖరి నిమిషంలో ఆగిపోయింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.