
తాజా వార్తలు
‘విక్రమ్’తో అనుసంధానానికి కృషి చేస్తున్నాం
ఇస్రో ఛైర్మన్ కె.శివన్ వెల్లడి
బెంగళూరు: చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనుగొనే విషయంలో తమ ప్రయత్నాలను విరమించలేదని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. ఆ వ్యోమనౌకతో సంబంధాలను ఏర్పర్చుకోవడానికి 14 రోజుల పాటు ప్రయత్నాలు చేస్తామని శనివారం మీడియాతో చెప్పారు. ‘‘యాత్ర చివర్లో నిర్వహించిన ‘పవర్ డిసెంట్’ అంచెలో నాలుగు దశలు ఉన్నాయి. మొదటి మూడు దశలు అద్భుతంగా సాగాయి. చివరిది సాఫీగా జరగలేదు. అందువల్లే ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి’’ అని వివరించారు. 2022లో చేపట్టబోయే భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ సహా సంస్థ తలపెట్టిన ఏ కార్యక్రమంపైనా దీని ప్రభావం ఉండబోదన్నారు. ల్యాండర్, రోవర్లను సాంకేతిక సత్తాను ప్రదర్శించేందుకు మాత్రమే ప్రయోగించినట్లు వివరించారు. ఆర్బిటర్‌లోని డ్యూయెల్ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడర్ (సార్)కు జాబిల్లి ఉపరితలానికి దిగువన 10 కిలోమీటర్ల లోతులోని అంశాలనూ పరిశోధించే సామర్థ్యం ఉందని వివరించారు. దాని సాయంతో జాబిల్లి ఉపరితలం కింద ఐస్ రూపంలో ఉన్న నీటిని కనుగొనవచ్చని తెలిపారు. ఆర్బిటర్‌లోని హై రిజల్యూషన్ కెమెరాకు 30 సెంటీమీటర్ల వరకూ జూమ్ అయ్యే సామర్థ్యం ఉందని, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిదని వివరించారు. ఆ వ్యోమనౌకలోని ఐఆర్ స్పెక్ట్రోమీటర్ కూడా శక్తిమంతమైందన్నారు. ఆర్బిటర్‌లో ఇంధనం పుష్కలంగా మిగిలి ఉండటం వల్ల అది ఏడున్నరేళ్ల పాటు పనిచేస్తుందని చెప్పారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
