close

తాజా వార్తలు

బిగ్‌బాస్‌లోకి నాని

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌-‌3’. ఆదివారంనాడు ప్రసారంకానున్న ఎపిసోడ్‌లో నేచురల్‌ స్టార్‌ నాని సందడి చేయనున్నారు. ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వచ్చారు. విక్రమ్‌.కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌస్‌లో నాని సందడి చేయనున్నారు. ‘బిగ్‌బాస్‌-2’ వ్యాఖ్యాతగా నాని వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్పట్లో నాని, నాగార్జున కథానాయకులుగా నటించిన ‘దేవదాస్‌’ సినిమా ప్రచారం కోసం నాగార్జున బిగ్‌బాస్‌కి వచ్చారు.
ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా రాహుల్‌  సేవ్‌ అవగా అలీ రజా, శ్రీముఖి, మహేష్‌ విట్టా, రవికృష్ణ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరూ ఎలిమినేట్‌ అవుతారో తెలియాలంటే ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే.  

 

 

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.