
తాజా వార్తలు
ఇంటెర్నెట్ డెస్క్: హాలీవుడ్ స్టార్ జెస్సికా ఛాస్టైన్, హారర్ సినిమాలను తాను ఏడు సంవత్సరాల వయసు నుండే చూడటం మొదలు పెట్టానని గుర్తుచేసుకుంది. ఐతే తాను మాత్రం చిన్నపిల్లలకి హారర్ చిత్రాలు చూపించడానికి నో అనే అంటుందట. చిన్నపుడు హారర్ చిత్రాలను చూసి, నిద్రలో దయ్యం కలలతో జడుసుకొనే దాన్నని, ఆ పరిస్థితి తన కూతురికి ఏ మాత్రం రానివ్వనని చెప్పేసింది ఈ అందగత్తె.
ఈమె నేటించిన హాలీవుడ్ హారర్ చిత్రం ఇట్ ఛాప్టర్ 2 ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. టేక్ షెల్టర్ తో కెరీర్ బ్రేక్ ను అందుకున్న ఈ సుందరాంగి, సైన్స్ ఫిక్షన్, ఫెమినిస్ట్ పాత్రలకు పెట్టింది పేరు.
"నేను ఎక్సార్శిస్ట్ సినిమాని చాలా చిన్నపుడే చూసేసాను. అపుడు నాకు 7-8 సంవత్సరాలుంటాయేమో. మా లివింగ్ రూమ్ లో కూర్చుని మా అమ్మతో ఆ సినిమా చూస్తున్నాను. కాసేపయాక ఆపెద్డామా అని మా అమ్మని అడిగినపుడు, చూడటం ఇష్టం లేకపోతే మేడ మీదనున్న నా గదిలోకి వెళ్ళిపొమ్మంది. కానీ ఆ సినిమాలో అమ్మాయికి తన గదిలోనే, తన మంచం మీదనే దయ్యం పడుతుందాయే... ఇంక నాకు వేరే దారి లేక మా అమ్మ పక్కనే దుప్పటి ముసుగు వేసుకుని కూర్చున్నా. మా అమ్మకి చాలా చిన్నవయసు లోనే నేను పుట్టడం వల్ల ఆమె నా మీద అంత అతిజాగ్రత్త చూపించలేదు. ఇపుడు ఈ విషయం బయటికి చెప్పేసినందుకు మా మమ్మీ నన్ను కచ్చితంగా చంపేస్తుంది" అంటూ నవ్వేసింది.
ఐతే తనకు హారర్ చిత్రాలు చూడటం ఎంతో ఇష్టమైనా, మామా అనే హారర్ చిత్రంలో ప్రధాన పోషించినా, తన కూతురికి మాత్రం చచ్చినా ఆ చిత్రాలు చూపించదట.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
