close

తాజా వార్తలు

100మంది ఫైటర్స్‌ ఒకేసారి వస్తుంటే..

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా సుజీత్‌ దర్శకత్వంలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన లభించినా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకూ ఈ చిత్రం రూ.400కోట్లను రాబట్టినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్‌ సీన్లు హాలీవుడ్‌ చిత్రాలకు ఏమాత్రం తీసుపోని విధంగా ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా యాక్షన్‌ సన్నివేశాలను ఏవిధంగా తెరకెక్కించారో తెలియజేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను పంచుకుంది. ‘సాహో మేకింగ్‌.. వరల్డ్‌ ఆఫ్‌ సాహో’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో యాక్షన్‌ సన్నివేశాల కోసం చిత్ర బృందం ఎంత కష్టపడందీ చూపించారు. ఆ వీడియోనూ మీరూ ఓసారి చూసేయండి.

బాలీవుడ్‌ నటులు, జాకీష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, మందిరా బేడీలతో పాటు, అరుణ్ విజయ్‌, మురళీ శర్మ, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ సినిమాను నిర్మించారు. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం అందించారు. 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.