close

తాజా వార్తలు

రజనీ కంటే శ్రీదేవికే ఎక్కువ పారితోషికం!

వారికంటే కమల్‌ హాసన్‌కే ఎక్కువ!

ముంబయి: అలనాటి తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్‌ అని సంబోధిస్తుంటారు. ఇప్పుడంటే సినీతారలు అందుకునే పారితోషికాలు లక్షలు, కోట్లల్లో ఉంటున్నాయి కానీ 70వ దశకంలో వేలల్లో తీసుకునేవారు. ఆ సమయంలోనే రజనీకాంత్‌ కంటే శ్రీదేవి ఎక్కువగా పారితోషికం తీసుకునేవారట. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’. 1976లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. కె.బాలచందర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమాకు గానూ కమల్‌హాసన్‌ తీసుకున్న పారితోషికం రూ.30వేలు కాగా.. రజనీకాంత్‌ కేవలం రూ.2000 తీసుకున్నారట. శ్రీదేవి మాత్రం రజనీ కంటే ఎక్కువగా రూ.5000 పారితోషికంగా తీసుకున్నారట. అప్పట్లో కమల్‌హాసన్‌ పేరున్న నటుడు కాబట్టి వారి కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శ్రీదేవి దేశంలోనే బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్లల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.