close

తాజా వార్తలు

చిన్నారి ఉద్యమకారిణి!

* ఎవరీ అమ్మాయి?
పేరు లిసిప్రియ కంగుజమ్‌. వయసు ఏడేళ్లు. వీళ్లది మన దేశంలోని మణిపుర్‌.

* అయితే ఏంటట?
ఈమె ఓ ఉద్యమకారిణి. వాతావరణ మార్పులు, గ్లోబల్‌వార్మింగ్‌లాంటి అంశాలపై ఉద్యమిస్తుంటుంది. ఈ విషయాలపై ఎన్నో దేశాల్లో పెద్ద పెద్ద వేదికలపై ఉపన్యాసాలిస్తోంది. ‘క్లైమేట్‌ ఛేంజ్‌ లా’ తీసుకురావాలంటూ మన పార్లమెంటు ముందూ ప్రదర్శనలు చేసింది.

* మరి ఇప్పుడే ఎందుకిలా వచ్చింది?
ఎందుకంటే ఈ మధ్యనే ఈమెను ‘వరల్డ్‌ చిల్డ్రన్‌ పీస్‌ ప్రైజ్‌2019’ వరించింది. గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌ ఇచ్చిన ఈ బహుమతిని చిన్నారి మాల్దీవుల్లో తీసుకుంది.

* అప్పుడు ఈ అమ్మాయి ఎలా ఫీలయ్యింది?
ఎంతో గొప్పగా. అంత పెద్ద వేదికపై వారి సంప్రదాయ దుస్తులు ధరించి ఈ బహుమతిని తీసుకుంది. అందరికీ కృతజ్ఞతలు చెప్పడంతోపాటు ఈ ప్రైజ్‌ తన బాధ్యతను మరింత పెంచిందని, ఇక ముందూ పోరాటం కొనసాగిస్తానని చెప్పింది. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యిందని ఇకనైనా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పేసింది. అంతా తనకు సాయం చేయాలని కోరింది.

* భలేగా మాట్లాడేసిందే..
అవును మరి. ఆమె మాటలు, స్పష్టమైన ఉచ్చారణ చూసి అక్కడున్న పెద్దలంతా ముచ్చటపడిపోయారు. అక్కడితో ఆగిపోలేదీ చిన్నారి. మాల్దీవుల పర్యావరణ మంత్రితోపాటు, ఇతర మంత్రుల్నీ కలిసి వాతావరణ అంశాలపై ముచ్చటించేసింది.

* బాగుంది. ఇంకా ఏమేం చేస్తోందిప్పుడు?
సింగపూర్‌, థాయిలాండ్‌, అంగోలా...లాంటి దేశాల్లో పర్యటిస్తూ ఉపన్యాసాలిస్తోంది. ప్లాస్టిక్‌ వాడకం వల్ల వచ్చే అనర్థాలు, దాన్ని ఎలా రీసైక్లింగ్‌ చెయ్యాలి? లాంటి అంశాల్ని వివరిస్తోంది. వాతావరణం, భూమి, నీరు.. పాడవ్వకుండా చూసుకోవాలంటూ అవగాహన కల్పిస్తోంది. దీంతో వాతావరణ మార్పులపై ఎక్కడ సదస్సులు జరిగినా ఈ పాపకు ఆహ్వానాలు అందుతున్నాయి. యూఎన్‌ క్లైమేట్‌ సమ్మిట్‌ 2019కీ తనను ఆహ్వానించారు.

* నిజంగా గ్రేటే!
అవును మరి. ఇంత చిన్న వయసులో పర్యావరణంపై ఈమె గొప్ప ఆలోచనా తీరు, ఇచ్చే ఉపన్యాసాలూ చూసి అంతా లిసిప్రియ గ్రేట్‌ అనేస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.