Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009773
            [news_title_telugu_html] => 

యురేనియం కొనొచ్చు.. అడవులను కొనగలమా..?

[news_title_telugu] => యురేనియం కొనొచ్చు.. అడవులను కొనగలమా..? [news_title_english] => Vijay Devarakonda on Nallamala Issue [news_short_description] => నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై టాలీవుడ్‌ యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్‌ చేశారు. యురేనియం కొనొచ్చు.. కానీ అడవులను కొనగలమా అంటూ ఆయన ప్రతి ఒక్కరిని.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-13 00:21:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
యురేనియం కొనొచ్చు.. అడవులను కొనగలమా..? - Vijay Devarakonda on Nallamala Issue - EENADU
close

తాజా వార్తలు

యురేనియం కొనొచ్చు.. అడవులను కొనగలమా..?

సోషల్‌మీడియా వేదికగా విజయ్‌ దేవరకొండ

హైదరాబాద్‌: నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై టాలీవుడ్‌ యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్‌ చేశారు. యురేనియం కొనొచ్చు.. కానీ, అడవులను కొనగలమా అంటూ  ప్రశ్నించారు. ‘యురేనియం తవ్వకాలతో నల్లమలలోని కొన్ని వేల ఎకరాల అటవీ ప్రాంతం ధ్వంసానికి గురి కానుంది. మనం సరస్సులను నాశనం చేసుకున్నాం. సహజ వనరులను నాశనం చేయడంతో కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టిని చూశాం. తాగునీటి వనరులు కూడా కలుషితమయ్యాయి. ఎక్కడా స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు. చాలా నగరాల్లో నీరు సరిగ్గా దొరకడం లేదు. కానీ, మనం మాత్రం ఇంకా మిగిలి ఉన్న ఆ కొన్ని సహజ వనరులను కూడా నాశనం చేసేందుకు పథకాలు వేస్తున్నాం. తాజాగా నల్లమలను నాశనం చేసే పనిలో పడ్డాం. యురేనియం కావాలనుకుంటే కొనుక్కోండి. యురేనియం కొనుక్కోవచ్చు.. కానీ అడవులను కొనొచ్చా..? పీల్చడానికి గాలి.. తాగడానికి నీరు లేనప్పుడు యురేనియం, విద్యుత్‌ శక్తితో ఏం చేసుకుంటాం.’ అని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు.

నల్లమలలోని యురేనియం తవ్వకాల వల్ల తెలుగు రాష్ట్రాలకు ముప్పు వాటిల్లుతుందని.. కృష్ణాజలాలు సైతం కలుషితమవుతాయని ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోషల్‌మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.