Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009815
            [news_title_telugu_html] => 

‘అవతార్‌2’ విషయంలో భయపడ్డా: కామెరూన్‌

[news_title_telugu] => ‘అవతార్‌2’ విషయంలో భయపడ్డా: కామెరూన్‌ [news_title_english] => James Cameron finally speaks about Avengers Endgame beating Avatar [news_short_description] => హాలీవుడ్‌ సూపర్‌ హీరోలందరూ కలిసి థానోస్‌ను అంతం చేసిన చిత్రం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ఈ ఏడాది వేసవిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. భారతీయ భాషల్లోనూ కాసులు వర్షం కురిపించింది. అంతేకాదు, జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత ... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 18:36:51 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘అవతార్‌2’ విషయంలో భయపడ్డా: కామెరూన్‌ - James Cameron finally speaks about Avengers Endgame beating Avatar - EENADU
close

తాజా వార్తలు

‘అవతార్‌2’ విషయంలో భయపడ్డా: కామెరూన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: హాలీవుడ్‌ సూపర్‌ హీరోలందరూ కలిసి థానోస్‌ను అంతం చేసిన చిత్రం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ఈ ఏడాది వేసవిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. భారతీయ భాషల్లోనూ కాసులు వర్షం కురిపించింది. అంతేకాదు, జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్‌’ కలెక్షన్లు సైతం బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ మాట్లాడారు. ‘అవెంజర్స్‌:ఎండ్‌గేమ్‌’ విజయం తనకు మరింత నమ్మకాన్ని పెంచిందని అన్నారు.

‘‘ప్రజలు ఇంకా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూస్తారన్న దానికి నిదర్శనం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’. ‘అవతార్‌2’, ‘అవతార్3’లను తెరకెక్కిస్తున్న నేను.. ఈ విషయంలోనే చాలా భయపడ్డా. ప్రపంచం మారిపోయిందనుకున్నా. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే పరిస్థితి ఉండదనుకున్నా. కానీ, ‘అవెంజర్స్‌’ నమ్మకాన్ని పెంచింది’’ అని అన్నారు. 

‘‘నేటి ఆధునిక యుగంలో ’అవతార్‌2’, ‘అవతార్‌3’ అద్భుతమైన విజయాలను అందుకుంటాయో లేదో ఎవరం చెప్పలేం. కానీ, మా ప్రయత్నం మేము చేస్తాం. అది జరగవచ్చు.. జరగకపోవచ్చు. కానీ, జరగడానికే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం ఎక్కడ చూసినా స్ట్రీమింగ్‌ సేవలు అందుబాటులో ఉన్న తరుణంలో అవెంజర్స్‌ కలెక్షన్లు నాకు సంతోషాన్ని ఇచ్చాయి. అయితే, నేనేమీ స్ట్రీమింగ్‌ సర్వీసులకు వ్యతిరేకం కాదు. నా దృష్టి అంతా పెద్ద తెరపై ఉంటుదంతే. ఇప్పటికీ ప్రజలు థియేటర్‌కు వచ్చి సినిమా చూడటం నాకు సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. 

2009లో విడుదలైన ‘అవతార్‌’ ఏ చిత్రానికీ సాధ్యం కాని రీతిలో ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్‌ డాలర్లు వసూళ్లందుకుంది. ఇటీవల ‘ఎండ్‌గేమ్‌’ 2.79 బిలియన్‌ డాలర్లు సాధించి ‘అవతార్‌’ రికార్డును బద్దలుకొట్టింది. అయితే ‘ఎండ్‌గేమ్‌’కు ఈ ఘనత అంత సునాయాసంగా దక్కలేదు. ఈ రికార్డు సాధించడం కోసం ఆ చిత్రాన్ని రెండోసారి కూడా విడుదల చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ‘ఎండ్‌గేమ్‌’ చిత్రబృందానికి అవతార్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.