close

తాజా వార్తలు

సినిమాల్లో రాజమౌళి గొప్పవాడే కానీ: బొత్స

విజయనగరం: రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స అన్నారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా కాపాడుతామని చెప్పారు. ఈ మేరకు విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే అంశాలను పరిశీలిస్తున్నామని, అందుకే కమిటీని నియమించామన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 13 జిల్లాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెప్పారు. ఎక్కడ తప్పు జరిగినా ఉపేక్షించబోమన్నారు.

సినిమాల్లో రాజమౌళి గొప్పవాడే.. అందుకు తాను కాదనని బొత్స అన్నారు. ఆయన విషయంలో తనకు వేరే అభిప్రాయం లేదన్నారు. దాసరి తర్వాత అంతటి గొప్పవాడని చెప్పారు. కానీ, రాజధాని ఎక్కడ పెట్టాలి? ఏ జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలి? రాష్ట్ర పరిస్థితి ఏమిటో ఆయనకు తెలీవు కదా? అని బొత్స అన్నారు. గత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిందని దుయ్యబట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి అలా కాదని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నామన్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో ప్రచారం చేసుకునే వాళ్లం తాము కాదని బొత్స అన్నారు. సాక్ష్యాలు, ఆధారాలతో సహా తాము ఆరోపణలు చేస్తున్నామని బొత్స అన్నారు.

పవన్‌వి పసలేని వ్యాఖ్యలు
పవన్‌ కల్యాణ్‌ పసలేని వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి బొత్స వ్యాఖ్యనించారు. పవన్‌ అనుభవ రాహిత్యానికి ఆయన మాటలే నిదర్శమన్నారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ అయ్యే వరకు పవన్‌ ఆగాలన్నారు. ఆయన అవినీతి పరులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఆడపిల్లలు బడికి వెళ్లలేకపోతున్నారంటే అది తమ తప్పు కాదని, ఆయన ప్రశ్నించాల్సింది గత పాలకులను అని హితవు పలికారు. 100 రోజుల పాలనపై గెజిట్‌ విడుదల కోరడమే అవివేకమని దెప్పిపొడిచారు. రాజధాని నిర్మాణ విషయంలో వేల కోట్లు అవినీతి జరిగిందని, అవినీతిని వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బొత్స అన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.