
తాజా వార్తలు
చిన్నప్పటినుంచీ తాడాట ఆడటం మనలో చాలామంది చేసిందే. ఈసారి తాడు సాయం లేకుండా గెంతేందుకు ప్రయత్నించండి. దీనివల్ల కలిగే లాభాలేంటో చూద్దామా...
* గెంతడాన్ని జంపింగ్ జాక్స్ అంటారు. ఇది గుండెకు, ఊపిరితిత్తులకు ప్రాణవాయువు సక్రమంగా అందేలా చేస్తుంది. దాంతో గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఎక్కువ కెలొరీలు ఖర్చవుతాయి. యాభైసార్ల చొప్పున మూడువిడతల్లో గెంతాల్సి ఉంటుంది.
* ఒత్తిడిగా అనిపించినప్పుడు ఉన్నచోటే కాసేపు గెంతిచూడమంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఇలా చేసినప్పుడు మెదడులో సెరటోనిన్ విడుదల అవుతుంది. ఈ హార్మోను ఆనందాన్ని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
* సాధారణంగా వ్యాయామానికి ముందు
వార్మప్ చేయాలంటారు. అవి చేసే సమయం లేనప్పుడు ఓ డెబ్బై నుంచి వందసార్లు గెంతినా చాలు. తల నుంచి పాదాల వరకు వార్మప్ చేసినట్లే అవుతుంది.
* వ్యాయామం చేసే సమయం లేనివారు దీన్ని ఎంచుకోవచ్చు. ఏం చేయాలంటే... కాళ్లు దగ్గరగా పెట్టి నిల్చోవాలి. ఒకసారి గెంతినప్పుడు కాళ్లను ఎడంగా ఉంచి.. చేతుల్ని పైకెత్తాలి. ఇలా పద్ధతి ప్రకారం చేస్తే ఫలితం ఉంటుంది.
* దీనివల్ల కండరాలూ దృఢంగా మారతాయి. శరీరం సాగినట్లుగా కాకుండా తీరైన ఆకృతిలో కనిపిస్తుంది. శరీరానికి అవసరమైన శక్తి అంది, దృఢంగా మారుతుంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
