close

తాజా వార్తలు

‘ఈ కన్యను తాకాలని చూస్తే మరణం తప్పదు’

భయపెడుతున్న ‘రాజుగారి గది3’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘రాజుగారి గది’ సీక్వెల్స్‌లో భాగంగా తెరకెక్కుతోన్న సినిమా ‘రాజుగారి గది 3’. అవికాగోర్‌, అశ్విన్‌బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ని సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో దెయ్యంగా అవికాగోర్‌ భయపెట్టింది. ‘ఈ కన్యను తాకాలని చూస్తే నీకు తప్పదు మరణం’ అని అవికాగోర్‌ను ఉద్దేశిస్తూ అశ్విన్‌బాబు చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. 

ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తుంది. అలీ, ఊర్వశి, బ్రహ్మజీ, ధనరాజు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. విజయదశమికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.