close

తాజా వార్తలు

గోవాకి బై బై చెప్పిన ‘డిస్కోరాజా’

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గోవా షెడ్యూల్‌ పూర్తయ్యిందని తెలియజేస్తూ.. గోవాలోని ఓ బీచ్‌లో ఇసుకతో ‘డిస్కోరాజా’ అని రాశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. 

వీఐ ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందించారు. ఈ సినిమా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.