
తాజా వార్తలు
ఇలాంటి నాయకులంటే నాకిష్టం
హైదరాబాద్: నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కథానాయకుడు విజయ్ దేవరకొండ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్‌ను పోస్ట్ చేస్తూ.. ‘ఈ నిర్ణయం నా ముఖంపై చిరునవ్వు తీసుకొచ్చింది. మనం అడిగాం, ప్రభుత్వం మన వెంటే ఉండి మద్దతుగా నిలిచింది. పవర్.. బాధ్యత.. యాక్షన్. ఇలాంటి నాయకులంటే నాకు ఇష్టం. మీకు నా పూర్తి ప్రేమ, గౌరవం ఎల్లప్పుడూ ఉంటాయి కేటీఆర్ అన్నా’.
‘నల్లమల అడవుల విషయంలో మనమంతా కలిసి ఏం సాధించామో చూడండి (నెటిజన్లను ఉద్దేశిస్తూ). ఓ మంచి పని కోసం అందరూ ఐకమత్యంగా కృషి చేస్తే ఎన్నో మార్పులు తీసుకురావొచ్చు’ అని విజయ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపడానికి వ్యతిరేకంగా విజయ్, శేఖర్ కమ్ముల, అనసూయ తదితరులతోపాటు నెటిజన్లు కూడా ‘నల్లమలను కాపాడుదాం’ అని పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
