close

తాజా వార్తలు

‘హ్యూమన్‌ కంప్యూటర్‌’గా విద్యాబాలన్‌

ముంబయి: బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్న చిత్రం ‘శకుంతలాదేవి.. హ్యూమన్‌ కంప్యూటర్‌’. ప్రముఖ గణితశాస్త్ర నిపుణురాలు, ‘హూమ్యన్‌ కంప్యూటర్‌’గా పేరుపొందిన శకుంతలా దేవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనుమీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన విద్యాబాలన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విద్యాబాలన్‌ ఒకటో నంబర్‌పై నిలవగా.. కంప్యూటర్‌ రెండు, క్యాలికులేటర్‌ మూడో నంబర్లపై ఉన్నట్లు చూపించారు. అంతేకాకుండా ఓ ప్రత్యేక వీడియోను కూడా చిత్రబృందం విడుదల చేసింది. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.