close

తాజా వార్తలు

మేఘాల్లోంచి నీరు ధారగా పడదేం?

ప్రశ్న: మేఘాల్లో నీరు ఒక్కసారిగా ఎందుకు కిందికి పడదు?

- ఎం.కామేశ్వర్‌, తిమ్మనచెరువు

 

ఒకసారి కుళాయిని తిప్పి చూడండి. దాని దగ్గర నీరు ధారగా ఉన్నా కింద పడే సమయంలో అది బిందువులుగా పడటాన్ని గమనిస్తారు.  నీరు కింద పడుతున్నప్పుడు... నీటినంతటినీ ఒకే ధారగా ఉంచాలన్న అంతరంగబలంతో పాటు దాని మీద భూమ్యాకర్షణ బలం పనిచేస్తుంది. భూమ్మీద పడుతున్నప్పుడు నేలకు దగ్గరగా ఉన్న నీటి వేగం కుళాయికి దగ్గరగా ఉన్న నీటి వేగం కన్నా ఎక్కువ. దీనికి కారణం భూమికున్న గురుత్వ త్వరణం. అందువల్ల నేలకు దగ్గరగా ఉన్న నీటి భాగం పైభాగాన్ని తెంచుకొని కింద పడుతుంది. తక్కువ ఎత్తులో కూడా లేని కుళాయి నీరే ధారగా ఏక ప్రవాహంగా నేల మీద పడదు. అలాంటిది కొన్ని వందల మీటర్ల పైనున్న మేఘాల నుంచి నీరు ఒకే ధారగా పడటాన్ని ఊహించలేం. మేఘం పేరుకు ఒకటే అయినా అందులో అన్ని భాగాలు కలిసి ఒకే నీటి సాంద్రతతో ఉండవు. వేర్వేరు ఎత్తుల్లో ఉన్న మేఘాల నుంచి పడే నీరు భూమ్మీద వేర్వేరు వేగాలతో పడుతుంది. దీనివల్ల అధిక వేగంతో పడే నీటిలో బెర్నౌలీ సూత్రం ప్రకారం తక్కువ ద్రవ పీడనం ఉంటుంది. పక్కనున్న గాలి ఒత్తిడికి ఆ నీరు బిందు రూపంలోకి సన్నబడుతుంది. బిందువులుగా మారడం ద్రవాలకున్న తలతన్యత వల్ల కలిగే లక్షణం. కాబట్టి వర్షపు నీరు నేల మీద చినుకులుగా మాత్రమే పడుతుంది.

- ప్రొ।। ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.