
తాజా వార్తలు
ముంబయి: ఇంగ్లాండ్ ప్రపంచకప్ హీరో బెన్‌స్టోక్స్‌కు ఓ పత్రికపై కోపమొచ్చింది. తమ గోప్యతకు భంగం కలిగించే అత్యంత సున్నితమైన వివరాలను ఎలా ప్రచురిస్తారని ‘ది సన్’ దినపత్రికపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఆ పత్రికను విమర్శిస్తూ ఓ సందేశం పెట్టాడు. స్టోక్స్ న్యూజిలాండ్ సంతతికి చెందిన వ్యక్తని అందరికీ తెలిసిందే. అతడి తల్లిదండ్రులు అక్కడే నివాసం ఉంటారు. ఇతడు మాత్రం ఇంగ్లాండ్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడే క్రికెట్ ఆడుతూ ఆ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు.
‘బెన్‌స్టోక్స్ రహస్య విషాదం. తన తల్లి మాజీ భర్త విద్వేషం కారణంగా యాషెస్ హీరో బెన్‌స్టోక్స్ సోదరుడు, సోదరి హత్యకు గురయ్యారు. ఆ క్రికెటర్ పుట్టుకకు మూడేళ్ల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది’ అని సన్ పత్రిక రాసింది. అతడి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలనూ అందులో ప్రస్తావించింది. తమ విలేకరిని న్యూజిలాండ్‌లోని స్టోక్స్ తల్లిదండ్రుల వద్దకు పంపి మరీ ఈ కథనం రాయించింది. అందులోని అంశాలను చూసి ఆవేదనకు గురైన స్టోక్స్ వెంటనే ఇవేనా పాత్రికేయ విలువలు అంటూ సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్ట్ చేశాడు.
‘ఈ రోజు ది సన్ 31 ఏళ్ల క్రితం నా కుటుంబానికి సంబంధించిన అత్యంత బాధాకరమైన, సున్నితమైన, వ్యక్తిగత వివరాలను ప్రచురించింది. స్థాయి తక్కువ, నీచమైన వారి వ్యవహారశైలి, పాత్రికేయ విలువల గురించి వర్ణించేందుకు నా దగ్గర మాటల్లేవు. నా కుటుంబం గురించి మనసు లేనట్టు, నీతి బాహ్యమైన భావాల్ని, పరిస్థితులను వర్ణించారు. మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఘోర సంఘటనల నుంచి బయటపడేందుకు నా కుటుంబం ఎంతో కష్టపడింది. నా తల్లిదండ్రుల వద్దకు ఆ పత్రిక విలేకరిని పంపించింది. సున్నితమైన కుటుంబ వివరాల్ని మొదటి పేజీలో ప్రచురించడం అంగీకారయోగ్యమేనని సన్ భావించినట్టుంది. ఇది స్థాయి తక్కువ పాత్రికేయం. కేవలం అమ్మకాలపైనే దృష్టి పెట్టింది. మా జీవితాలను క్షోభకు గురిచేసిన పరిస్థితుల గురించి రాయడం హేయం’ అని స్టోక్స్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో 55.12 సగటుతో రెండు శతకాలు సహా 441 పరుగులు, 8 వికెట్లు తీసిన అతడికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కిన సంగతి తెలిసిందే.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
ఎక్కువ మంది చదివినవి (Most Read)
