close

తాజా వార్తలు

అధ్యక్షులకు సోషల్‌ మీడియా హానికరం

ట్రంప్‌కు ఒబామా చురక

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. మరికొన్ని నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రంప్‌ ప్రచారంలో జోరును పెంచారు. ఈ క్రమంలో అధ్యక్షుడు సోషల్‌ మీడియాకు, టీవీకి దూరంగా ఉండాలంటూ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకునే వారో తెలిపారు. పేరు ప్రస్తావించకుండా ట్రంప్‌కు చురకలు అంటించారు.

‘సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవాలంటే టీవీలు చూడకూడదు. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి. ఈ రెండు సలహాలను మాత్రమే ఇవ్వగలను. ఒకవేళ మీరేగనక మా అధ్యక్షుడైతే(మీడియా ప్రతినిధి) అలాంటి పని మాత్రం చేయకండి. ఎందుకంటే ఇది హింసను ప్రేరేపిస్తుంది. మా మీద ఎలాంటి నేరారోపణలు లేవు. నేనింతక ముందే చెప్పాను. ఈ రోజుల్లో ఇలా ఉండటం చాలా అరుదు’అని పేర్కొన్నారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.