close

తాజా వార్తలు

సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం: భారీ నష్టం!

ముంబయి: బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌, సారా అలీఖాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కూలీ నెం.1’. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ముంబయిలోని ఫిల్మీస్థాన్‌ స్టూడియోలో ఓ సెట్‌ను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 11వ తేదిన ఈ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్నిప్రమాదం తర్వాత ఆ చిత్ర నిర్మాత సోషల్‌మీడియా వేదికగా ‘సెట్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బందికి, ముంబయి పోలీసులకు ధన్యవాదాలు. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.’ అని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం సెట్‌లో చోటుచేసుకున్న ఈ అగ్నిప్రమాదం వల్ల చిత్రబృందానికి రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని బాలీవుడ్‌లో వినికిడి. ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

వరుణ్‌ధావన్‌, సారా అలీఖాన్‌ నటిస్తున్న ‘కూలీ నం1’ చిత్రానికి డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ముంబయిలో షూటింగ్‌ చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన కారణంగా కొన్ని రోజుల పాటు ఈ షూటింగ్‌ను వాయిదా వేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.