close

తాజా వార్తలు

ఈ హీరోను గుర్తుపట్టారా..?

హైదరాబాద్‌: తన చరవాణిలో ప్రకృతి అందాలను చిత్రీకరిస్తున్న ఈ టాలీవుడ్‌ యువ కథానాయకుడిని గుర్తుపట్టారా..! ఆయన మరెవరో కాదండి సాయిధరమ్‌ తేజ్‌. ‘చిత్రలహరి’ హిట్‌ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. మారుతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ విజయనగరం జిల్లాలోని కోరుకొండలో జరుగుతుంది. దీనికి సంబంధించిన చిత్రాలను దర్శకుడు మారుతి సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ప్రతిరోజూ పండగే’లో ఈరోజు పండగ కోరుకొండలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి దగ్గర’ అని ఆయన పేర్కొన్నారు. మారుతి షేర్‌ చేసిన ఈ చిత్రాలలో సాయిధరమ్‌ తేజ్‌ కోరుకొండ అందాలను చిత్రీకరిస్తూ కనిపించారు. ఆ ప్రకృతి అందాలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమన్‌ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. 2016లో వచ్చిన ‘సుప్రీమ్‌’ చిత్రంలో సాయి-రాశీ కలిసి నటించారు. ఈ సినిమాకి అనిల్‌రావి పూడి దర్శకత్వం వహించారు.


 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.