close

తాజా వార్తలు

‘జయలలిత’ కోసం కంగన.. ఎలా మారారో చూడండి

ముంబయి: దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా వెబ్‌ సిరీస్‌లు‌, చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలైవి’. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ పాత్ర కోసం అన్ని విధాలుగా సిద్ధమవుతున్నట్లు ఆమె చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. పాత్ర కోసం తమిళం నేర్చుకోవాలనుకుంటున్నట్లు ఇటీవల కంగన తెలిపారు. 

తాజాగా కంగనా రనౌత్‌ ఫ్రోస్థటిక్‌ మేకప్‌ కోసం దర్శకుడు విజయ్‌, నిర్మాత బ్రిందా ప్రసాద్‌లతో కలిసి కాలిఫోర్నియా వెళ్లారు. ఈ మేరకు జాసన్‌ కొలిన్స్‌లో స్టూడియోలో జయలలిత పాత్ర కోసం కంగనా సిద్ధమవుతున్న చిత్రాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. హాలీవుడ్‌లో పేరుపొందిన చిత్రాలకు పనిచేసిన మేకప్‌ ఆర్టిస్ట్‌ జాసన్‌ కొలిన్స్‌ ఈ చిత్రానికి పనిచేస్తున్నారని నిర్మాతలు విష్ణు ఇందూరి, బింద్రా ప్రసాద్‌ తెలిపారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.