close

తాజా వార్తలు

తొలిరోజు షూటింగ్‌లో పూజాహెగ్డే..ఇలా..!

హైదరాబాద్‌: యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ సరసన పూజా హెగ్డే సందడి చేయనున్న విషయం తెలిసిందే. ‘మిస్టర్‌ మజ్ను’ తర్వాత అఖిల్‌ కొత్త సినిమా ఇటీవల ప్రారంభమైంది. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ సుందర్‌ బాణీలు అందిస్తున్నారు. జీఏ2 ప్రొడక్షన్స్‌ పతాకంపై బన్నీవాసు, వాసు వర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా పూజాహెగ్డే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఆమెకు స్వాగతం చెబుతూ ఓ ప్రత్యేక వీడియోను సోషల్‌మీడియా వేదికగా చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. తొలిరోజు సెట్‌లో ఆమె ఎలా గడిపారో తెలియజేస్తూ ఈ వీడియో రూపొందించారు.

‘అఖిల్‌’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన అక్కినేని అఖిల్‌ తర్వాత ‘హలో’తో హిట్‌ అందుకున్నారు. ఆయన నటించిన మూడో చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’ ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు ఇటీవల ‘మహర్షి’ , ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రాలతో విజయం అందుకున్న పూజాహెగ్డే.. ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో బిజీగా ఉన్నారు.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.