close

తాజా వార్తలు

సాయిధరమ్‌తేజ్‌ స్పెషల్‌ వీడియో చూశారా..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ భూమిని కాపాడండి అంటూ ఓ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించి ఓ స్పెషల్‌ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్‌ సమయంలో తనను చూసేందుకు వచ్చిన చిన్నారులు, అభిమానులతో ఆయన కరచాలనం చేస్తూ ఈ వీడియోలో కనిపించారు. ‘మనకు మరో భూమి లేదు. మనం మనతరం కోసమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం కూడా ఈ భూమిని కాపాడుకోవాలి. ఇది నిజం.’ అని సాయి పేర్కొన్నారు. 

‘చిత్రలహరి’ హిట్‌ తర్వాత సాయిధరమ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ విజయనగరం జిల్లా కోరుకొండలో జరిగింది. ‘సుప్రీమ్‌’ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.