close

తాజా వార్తలు

అభిమాని వీడియో.. మాధవన్‌ ఎమోషనల్‌

ముంబయి: ఒకప్పుడు లవర్‌ బాయ్‌గా అనిపించుకున్న నటుడు మాధవన్‌. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘సఖి’ చిత్రం ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చింది. అయితే తాజాగా ఓ అభిమాని రూపొందించిన వీడియో చూసి మాధవన్‌ చాలా ఎమోషనల్‌ అయ్యారు. మాధవన్‌ సినిమాల్లోని సన్నివేశాలతో రూపొందించిన ఈ వీడియోను ఆయన ఇన్‌స్టా వేదికగా అందరితో పంచుకున్నారు. ‘అభిమాని రూపొందించిన వీడియో.. ఇది చూస్తే నాకు ఆ పాత రోజులు గుర్తువచ్చాయి. నేను చాలావరకూ ఆ సన్నివేశాలను మర్చిపోయాను.’ అని మాధవన్‌ తెలిపారు.

ప్రస్తుతం ఆయన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్‌ పాత్రలో నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అనంత్‌ మహాదేవన్‌, మాధవన్‌ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దీంతోపాటు మాధవన్‌.. అనుష్క నటిస్తున్న ‘నిశ్శబ్దం’లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.