close

తాజా వార్తలు

జాతి కోసం యుద్ధం చేస్తే చరిత్ర అవుతుంది!

‘సైరా’ పదేళ్ల మా కల: పరుచూరి వెంకటేశ్వరరావు

హైదరాబాద్‌: ‘సైరా’ తమ పదేళ్ల కల అని ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. చిరంజీవి కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి కథ అందించిన పరుచూరి సోదరుల్లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘ఈ కథ చాలా మందికి చెప్పాం. అయితే, చిరంజీవిగారు చేస్తానన్నా తర్వాత చాలా సంవత్సరాలు వేచి చూశాం. రామ్‌చరణ్‌ వల్ల ఇన్నేళ్లకు సినిమా మన ముందుకు రాబోతోంది. తనకు జన్మనిచ్చి, ఓ స్థాయిలో నిలబెట్టిన తండ్రిని శిఖరం అంచున నిలబెట్టాలని అత్యద్భుతమైన సినిమా తీశాడు. గాంధీని స్మరించుకునే రోజైన అక్టోబరు 2న ఈ సినిమా విడుదలవుతోంది. పైనుంచి గాంధీజీ కూడా సినిమాను ఆశీర్వదిస్తారు. ఈ సినిమా కోసం నాతో పాటు చాలా మంది పనిచేశారు. ఈ సినిమాలో నరసింహారెడ్డి పాత్ర పోషించిన చిరంజీవి తన గురువు గోసాయి వెంకన్న అయిన అమితాబ్‌ బచ్చన్‌ వద్దకు వెళ్లి ‘నేను భార్య బిడ్డలను వదిలేసి స్వాతంత్ర్య పోరాటానికి వెళ్తున్నా’ అని అంటే అప్పుడు అమితాబ్‌  ‘భార్య కోసం యుద్ధం చేస్తే పురాణం అయింది. భూమి కోసం యుద్ధం చేస్తే ఇతిహాసమైంది. జాతి కోసం యుద్ధం చేస్తే చరిత్ర అవుతుంది’ అంటారు. ఇది చరిత్ర అయింది కనుకే ఇప్పుడు మనం దీన్ని తీయగలుగుతున్నాం. సాయి మాధవ్‌ బుర్రా అద్భుతమైన సంభాషణలు రాశారు’’ అని చెప్పుకొచ్చారు.

మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌కు సముద్రం లేదని ఎవరు చెప్పారు. మెగాస్టార్‌ ఒక్క పిలుపు ఇస్తే వసంతాలు కాదు.. సముద్రాలు కూడా తరలివస్తాయి. మిమ్మల్ని చూస్తే అదే అనిపిస్తోంది. మా అమ్మమ్మకు సినిమా అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా చిరంజీవి సినిమాకు మాటలు రాయమనేది. ‘ఖైదీ నంబరు 150’తో ఆ కల నెరవేరింది. ఆ సినిమాకు వేమారెడ్డితో కలిసి డైలాగ్‌లు రాశారు. ‘పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది’ ఈ డైలాగ్‌ చిరంజీవి మాత్రమే చెప్పాలని రాశా. ఆ తర్వాత వెంటనే ‘సైరా’కు అన్ని డైలాగ్‌లు రాయడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. రామ్‌చరణ్‌ అద్భుతమైన నిర్మాత. ఈ సినిమాతో సురేందర్‌రెడ్డిలాంటి మంచి స్నేహితుడు దొరికాడు. నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పుకొచ్చారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.