ర్యాంప్‌వాక్‌తో అదరగొట్టిన బేబీ

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి సమంత పాల్గొన్నారు. డిజైనర్ వస్త్రాలు ధరించి ర్యాంప్‌వాక్‌తో అలరించారు.
|
రాయితీ ఆనందం!

ఉల్లిపాయలు కిలో రూ.22.. ఒకేసారి అంత తక్కువ ధరకు ఎలా లభిస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారా! జాతీయ వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం తరపున దిల్లీలో ఉల్లిపాయలు అమ్ముతున్నారు. రాయితీ ధరతో కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. దిల్లీలో ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.80 ఉంది.

|
దసరా సరదా పచ్చబొట్లు!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నవరాత్రి వేడుకల కోలాహలం మొదలైంది. సెప్టెంబర్ 29 నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా
యువతులు తమ వీపుపై విభిన్న పచ్చబొట్లను వేయించుకున్నారు.

|
చెట్టు మాటలు చెవికెక్కేనా!

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మెట్రో వాటర్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కు ఉంది. దీనిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది మాట్లాడే చెట్టు. కళ్లు తిప్పుతూ, కొమ్మలు ఆడిస్తూ వాన నీటిని ఎలా సంరక్షించాలనే అంశాలను అనర్గళంగా చెబుతుంది. థీమ్ పార్కు సందర్శనకు వచ్చిన వారు చెట్టు మాటలను ఆసక్తిగా వింటున్నారు.
|
మందు బాబులం మేము ఎవరి మాటా వినం!

బహిరంగ మద్యపానం ప్రభుత్వం నిషేధించిన కొందరు మందుబాబుల ప్రవర్తనలో మార్పులేదు. కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌లో మంగళవారం కొందరు మందుబాబులు హల్చల్ చేశారు. బీరు సీసాలు పట్టుకొని సముద్రంలో కేరింతలు కొట్టారు. మద్యం మత్తులో ఉన్నవారు సరదాగా తోటి స్నేహితులను నీళ్లలో ముంచేందుకు ప్రయత్నించారు. వీరిని చూసి ఇతర సందర్శకులు భయాందోళనలకు గురయ్యారు.

|
డిజిటల్ నిర్మాతగా బాద్షా

బార్డ్ ఆఫ్ బ్లడ్ వెబ్ సిరీస్ ప్రత్యేక ప్రదర్శన ముంబయిలో నిర్వహించారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నిర్మాతగా రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఇమ్రాన్ హష్మీ, శోభిత ధూళిపాళ, వినీత్ కుమార్ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 27 నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తదితరులు హాజరయ్యారు.

|
ఫుట్‌బాల్ క్లబ్ జెర్సీతో కోహ్లీ

ఇండియన్ సూపర్ లీగ్ జట్టు ఎఫ్‌సీ గోవా జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్నారు. ఫుట్‌బాల్ క్లబ్ గోవా (ఎఫ్‌సీ గోవా) జట్టుకు కోహ్లీ సహ యజమాని. కొత్త జెర్సీతోపాటు ‘బీ గోవా’ వార్షిక ప్రచార కార్యక్రమాన్ని కోహ్లీ ప్రారంభించారు.
|
‘అమ్మ’ పూజకు అంతా సిద్ధం!

దసర నవరాత్రి వేడుకలకు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో నిర్వహించే వేడుకలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. కోల్‌కతాలో దుర్గామాతను కొలిచేందుకు భారీ మండపాలను రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబు చేస్తున్నారు.

|
మంచువారి ఇంట్లో సింగానికి అతిథ్యం

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబును తమిళ కథానాయకుడు సూర్య మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మోహన్ బాబు ఆహ్వానం మేరకు సూర్య విచ్చేసినట్లు ఆయన ప్రతినిధి తెలియజేశారు. ప్రస్తుతం మోహన్‌బాబు తమిళంలో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తుండగా సూర్య నిర్మాత.
|