
తాజా వార్తలు
హైదరాబాద్: చిరంజీవి కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. తమ అనుమతి లేకుండా ఈ చిత్ర విడుదలను, సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం ఈ కేసు విచారణ జరిగింది. ఈ చిత్రానికి ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని సెన్సార్‌బోర్డు కోర్టుకు తెలిపింది. సోమవారం లోపు తమ నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్‌రెడ్డి న్యాయమూర్తి ఎదుట తన వాదనలు వినిపించారు. ‘సైరా’ అసలు బయోపిక్ కాదని కోర్టుకు తెలిపారు.
తమను చిత్ర నిర్మాత రామ్‌చరణ్ మోసం చేశారని, ఒప్పందం మేరకు సొమ్ము ఇవ్వడం లేదని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు పిటిషన్లో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన దొరవారి దస్తగిరిరెడ్డి, మరో నలుగురు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- శరణార్థులకు పౌరసత్వం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- భాజపాకు తెరాస షాక్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
